ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్త్రీ పురుషులు చాలామంది ఈ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడం ఆపడం కోసం ఎన్నెన్నో షాంపూలు, హెయిర్ ఆయిల్స్, కొన్ని రకాల నేచురల్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ జుట్టు రాలడం మాత్రం ఆగిపోదు. అయితే జుట్టు రాలిపోవడానికి ప్రధాన సమస్యల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఒకటి అని చెబుతున్నారు. వాటిలో కూలింగ్ తాగడం కూడా ఒక కారణం అని చెబుతున్నారు..
కాగా కూల్ డ్రింక్స్ తాగడం ఈ రోజుల్లో చాలా కామన్ గా మారిపోయింది. బయట ఎండలు మండిపోతూ ఉంటే ఉపశమనం కోసం కూడా ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. కానీ ఈ కూల్ డ్రింక్స్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా కారణంగా ఇలా జరుగుతుందట. ప్రతిరోజూ సోడా ఉన్న కూల్ డ్రింక్ తాగితే కచ్చితంగా జుట్టు రాలుతుందట. సాధారణంగా జుట్టు జెనటికల్ ప్రాబ్లమ్, యాంక్సైటీ, బాడీ మాస్ ఇండెక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు, పొగ తాగే అలవాటు, ఫిజికల్ యాక్టివిటీ ఇలా పలు కారణాల వల్ల రాలుతుందట.
అయితే కూల్ డ్రింక్స్ లో ఉండే షుగర్ కారణంగా కూడా పురుషుల్లో జుట్టు రాలుతుందట. కేవలం రోజుకి ఒక్కటే కదా అని చాలా మంది భావించవచ్చు. కానీ. ఒక్క డ్రింక్ కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. కేవలం జుట్టు రాలడమే కాదు. ఈ కూల్ డ్రింక్స్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందట. కాబట్టి ఈ వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.