Site icon HashtagU Telugu

Health Tips: టీ కాఫీలో ఆరోగ్యానికి ఏది మంచిది మీకు తెలుసా?

Health Tips

Health Tips

ప్రపంచవ్యాప్తంగా కాఫీ,టీ ల ప్రియులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి పదిమందిలో 9 మందికి కాఫీలు టీ తాగే ఉంటుంది. కొందరు రోజుల్లో కనీసం ఒక్కసారి అయినా తాగితే మరి కొందరు మాత్రం కనీసం రోజుకి నాలుగు ఐదు సార్లు కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. కొందరు కాఫీ అయితే మరికొందరు టీ మాత్రమే తాగుతూ ఉంటారు. అయితే కాఫీ,టీలు తాగేటప్పుడు చాలా మందికి ఆ రెండింట్లో ఏది మంచిది అన్న సందేహం కలిగే ఉంటుంది. మరి కాఫీ, టీ లలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాఫీ శక్తిని తాగితే తక్షణ ఎనర్జీ వస్తుంది. ఇది మన ఏకాగ్రతను కూడా పెంచుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచే కెఫిన్ కంటెంట్ యే ఇందుకు ప్రధాన కారణం అని చెబుతున్నారు.

లిమిట్ లో కెఫిన్ ను తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందట. అభిజ్ఞా పనితీరు కూడా బాగుంటుందని చెబుతున్నారు. కాఫీ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన కణాలను రక్షించడానికి సహాయపడతాయట. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయ పడుతుందని చెబుతున్నారు. అయినప్పటికీ కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే యాంగ్జైటీ, చంచలత, నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది కొంతమందిలో కాఫీ హృదయ స్పందన రేటును పెంచుతుందట. అలాగే రక్తపోటు పెరగడానికి కూడా కారణమవుతుందని చెబుతున్నారు. ఇకపోతే టీ విషయానికి వస్తే..

టీ ని ఎన్నో ఏళ్ళ నుంచి తాగుతున్నారు. నీళ్ల తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం ఏదైనా ఉంది అంటే అది టీ మాత్రమే అని చెప్పాలి. నిజానికి టీ ఎన్నో రుచుల్లో లభిస్తుంది. అందుకే దీన్ని చాలా మంది తాగుతారు. టీ ఆరోగ్యకరమైన పానీయంగా కూడా ఖ్యాతి పొందింది. ఎందుకంటే టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాఫీ మాదిరిగానే టీలో ఉండే పాలీఫెనాల్స్ కూడా శోథ నిరోధక, క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉన్నాయని నిరూపించబడింది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. టీ లో కెఫిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే టీలో థయామిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది శాంత పరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

అలాగే టీ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. టీ లో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు కూడా ఉంటాయట. టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. టీ లో ఫ్లేవనాయిడ్లు ఉండటం వల్ల రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీర మంట కూడా తగ్గుతుంది. కాఫీ, టీ రెండూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయినప్పటికీ ఈ రెండింటినీ ఎక్కువగా తాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనల్ గా ఇది వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించింది. ఏది తాగినా లిమిట్ లో తాగితే ప్రయోజనాలను పొందుతారు.