Site icon HashtagU Telugu

Coconut Water: కొబ్బరి నీరు మంచివే కానీ.. ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తాగకూడదట!

Coconut Water

Coconut Water

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి, డీహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడటానికి ఇవి బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అసలు తాగకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరినీరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదట. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లగా ఉంటుందట. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయట. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే శరీరం నుంచి చాలా రకాల టాక్సిన్స్ బయటకు పోతాయట. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. కొబ్బరి నీళ్లు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ల స్థాయిని తగ్గిస్తుందట. క్రమం తప్పకుండా తాగితే రక్తం గడ్డకట్టడం, గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. కాగా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రక్తపోటును సాధారణంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

ఇతర జ్యూస్‌ లతో పోలిస్తే కొబ్బరిలో చక్కెర, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయట. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి. అలాగే కొబ్బరి నీళ్లు తాగితే జీవక్రియ పెరుగుతుందట. ఇందులో చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోదక శక్తి పెరగడానికి కూడా ఈ వాటర్ బాగా ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. అధిక రక్తపోటు, కిడ్నీ, డయాబెటిస్, అలర్జీ, జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వారికి మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఒకవేళ వారు తాగాలి అనుకుంటే కచ్చితంగా నిపుణులు సలహా తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.