Site icon HashtagU Telugu

Coconut Water: అదేంటి కొబ్బరి నీళ్లు తాగితే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Coconut Water

Coconut Water

కొబ్బరి నీళ్లు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు వీటిని ఇష్టపడి తాగుతూ ఉంటారు. కొబ్బరి నీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొబ్బరి నీళ్లను ఆరోగ్యం బాగోలేనప్పుడు, వేసవికాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. వీటిని తరచుగా తీసుకొని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగితే బరువు కూడా తగ్గుతారని మీకు తెలుసా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు వైద్యులు. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా కొబ్బరి నీరు తాగడం వల్ల మన బాడీ హైడ్రెటెడ్ గా ఉంటుంది. అంతేకాకుండా బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా దాని నుంచి వచ్చే సమస్యలను కంట్రోల్ చేయడంలోన కొబ్బరి నీరు కీలకంగా పని చేస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇది జీవక్రియను పెంచడానికి, ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుందట. కొబ్బరి నీరు అధిక నీటి కంటెంట్ , ఎలక్ట్రోలైట్ కూర్పు కారణంగా హైడ్రేటెడ్‌ గా ఉండటానికి సహజమైన,, రిఫ్రెష్ మార్గం అని చెప్పాలి. సోడాలు లేదా పండ్ల రసాలు వంటి అనేక ఇతర చక్కెర పానీయాలతో పోలిస్తే, కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

కాబట్టి అధిక కేలరీల పానీయాలకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీళ్లను ఎంచుకోవడం వల్ల మొత్తం క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుందట.బరువు తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అలాగే ఇవి జీవక్రియ, శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తరచుగా సహజ స్పోర్ట్స్ డ్రింక్‌గా ప్రచారం జరుగుతుంది. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది. వేగవంతమైన రికవరీని ప్రోత్సహిస్తుంది, బరువు నిర్వహణకు అవసరమైన స్థిరమైన వ్యాయామ దినచర్యకు మద్దతు ఇస్తుంది.