Site icon HashtagU Telugu

Lose Weight: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ టీని తప్పకుండా తాగాల్సిందే?

Mixcollage 29 Jan 2024 04 43 Pm 4054

Mixcollage 29 Jan 2024 04 43 Pm 4054

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొందరు విపరీతమైన బరువు పెరిగే అందమైన కూడా కనిపిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే వారి పనులు వారు స్వతంత్రంగా చేసుకోవడానికి కూడా వీలు లేక ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు. ఇలా అధిక బరువు ఉండేవారు తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గేందుకు ఎన్ని కష్టాలు పడినా కొందరైతే అస్సలు లావు తగ్గరు.

వ్యాయామాలు, కసరత్తులు, జిమ్ ఇలా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మాత్రం ఉండదు. అయితే మీరు కూడా అలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే టీ ని తాగితే చాలు వేగంగా బరువు తగ్గడం ఖాయం. మరి ఆ వివరాల్లోకి వెళితే.. లవంగం అనేది ఒక సుగంధ ద్రవ్యం. దీన్ని మనం మసాలాగా చేసుకొని ప్రతి కూరలో వాడుకుంటాం. లవంగా వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శరీరంలో ఉన్న అనవసర కొవ్వును కరిగించడానికి లవంగా చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ బాక్టీరియా గుణాలతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే శరీర బరువును తగ్గిస్తుంది. లవంగాలతో చేసిన టీని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది.

శరీరంలోని అనవసర కొవ్వు అంతా కరిగి మనిషి చాలా ఫిట్ గా మారుతాడట. మన పూర్వీకులు ఎక్కువగా లవంగాలతో చేసిన టీనే తాగేవారట. అందుకే వాళ్లు ఏమాత్రం పొట్ట లేకుండా చాలా ఫిట్ గా ఉండేవారు. లవంగాల టీని తయారు చేయడం చాలా సులభం. కొన్ని లవంగాలను తీసుకొని, ఒక గిన్నెలో నీళ్లు పోసి ముందు మరిగించి ఆ తర్వాత కాసిన్ని లవంగాలు, దంచిన అల్లం వేసి ఇంకాస్త మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి, దాంట్లో ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలిపి కాసింత నిమ్మరసం కలిపి తాగేయాలి. దీన్ని పూర్తిగా చల్లారేదాక ఉంచవద్దు. కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. ఇలా చేస్తే తొందరగా బరువు తగ్గడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగి పోతుంది.