Site icon HashtagU Telugu

Teeth Pain: పంటినొప్పి తెగ ఇబ్బంది పెడుతోందా.. అయితే ఇలా చేయాల్సిందే?

Mixcollage 18 Jul 2024 04 30 Pm 4866

Mixcollage 18 Jul 2024 04 30 Pm 4866

ఇదివరకటి రోజుల్లో కేవలం వయసు మీద పడిన వారికి, వృద్ధాప్య వయసులో ఉండే వారికి మాత్రమే పంటి నొప్పి సమస్యలు వచ్చేవి. కానీ రాను రాను కాలం మారిపోవడంతో ఈ పంటి నొప్పి సమస్యలు చిన్న పిల్లల నుంచే మొదలవుతున్నాయి. అయితే ఈ పంటి నొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. తీపి ఎక్కువగా తినడం, బ్రష్ సరిగా చేయకపోవడం, పన్ను పుచ్చిపోవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల పంటి నొప్పి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ పంటి నొప్పి తీవ్రం అయినప్పుడు కనీసం నీరు తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు..

ఈ పంటి నొప్పిని తగ్గించుకోవడానికి వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి పన్ను క్లీన్ చేయించుకోవడం లేదంటే పళ్ళు పీకించుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. కానీ ఇక మీదట అలా చేయాల్సిన పనిలేదు అంటున్నారు వైద్యులు.. ఎందుకంటే ఇంట్లోనే దొరికే వాటితోనే చక్కటి రెమిడీలు ఫాలో అయితే ఈ పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.. ఇంతకీ ఆ రెమెడీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎందుకు లవంగం నూనె లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. చాలా రకాల టూత్ పేస్టులలో లవంగాలను ఉపయోగిస్తూ ఉంటారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో లవంగాలు ఎంతో బాగా పనిచేస్తాయి.

లవంగం నూనెలోని యూజినాల్ అనే పదార్ధం, ఇది ప్రభావిత ప్రాంతాలను ఉపశమనాన్ని అందిస్తుందట. అయితే అందుకోసం ముందుగా లవంగాలను చూర్ణం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ లవంగాల పొడిని ఒక చిన్న జాడిలో ఉంచాలి. తర్వాత అందులో తగినంత ఆలీవ్ నూనె కూడా కలపాలి. ఆ తర్వాత ఆ జాడీని మూసి ఆ మిశ్రమాన్ని చీకటి ప్రదేశంలో ఒక వారం లేదా రెండు వారాలపాటు అలాగే ఉంచాలి. అప్పుడప్పుడు మీరు ఆ జాడీని షేక్ చేయవచ్చు. ఒక వారం లేదా రెండు వారాల తర్వాత, నూనె నుండి చిన్న ముక్కలుగా తరిగిన లవంగాలను వడకట్టి, లవంగం నూనెను ప్రత్యేక కూజాకు బదిలీ చేయాలి.

అయితే లవంగం నూనెను చీకటి కూజాలో నిల్వ ఉంచాలని గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ నూనెను చిన్న కాటన్ బాల్ పై వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఇలా తరచూ చేయడం వల్ల పంటి నొప్పి తొందరగా తగ్గుతుంది. పంటినొప్పిని సులభంగా తగ్గించినప్పటికీ దీని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే హానికరం. చర్మం కాలిపోతుంది. గర్భిణీ స్త్రీలు, పిల్లలు దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి.

note: పైన ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version