ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాటు కారణంగా చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎక్కువ మంది ఈ డయాబెటిస్ వ్యాధి భారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ కు మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి వచ్చింది అంటే చాలు. జీవితాంతం అది పోదు. అయితే ఎప్పటికప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించుకోవడానికి అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి కానీ దానిని పూర్తిగా నియంత్రించడానికి ఇంకా మార్కెట్ లోకి ఎటువంటి మందులు రాలేదు.
అయితే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు మందులతో పాటు కొన్నిరకాల ఆరోగ్య చిట్కాలను పాటించడం వల్ల కూడా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అందులో ముఖ్యంగా వంటింట్లో ఉండే లవంగాలు డయాబెటిస్ సమస్యకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. లవంగాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంతో పాటు కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటిస్ పేషెంట్లు లవంగాలను తినడం వల్ల లవంగాలలో ఉండే నిజారిసిన్ గతంలోని చక్కెరను నియంత్రణలో ఉంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్ లవంగాలని తప్పకుండా తీసుకోవాలి.
లవంగాలలో యూజెనాల్ అని పిలువబడే ఫైటోకెమికల్ పదార్థం ఆక్సీకరణ నష్టాన్ని నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. అందుకే లవంగాలను తరచుగా తింటూ ఉండాలి. అలాగే లవంగాలలో ఉండే యూజెనాల్ కాలెయాన్ని శుభ్రపరచడానికి ఎంతో సహాయపడుతుంది.. లవంగాలు తినడం వల్ల అవి మన శరీరంలో ఉండే విష పదార్థాలను కూడా బయటకు పంపుతాయి. అలాగే తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.