Site icon HashtagU Telugu

Cholesterol: చేతుల నుంచి కాళ్ళ దాకా కొలెస్ట్రాల్ ముప్పు.. ఇలా చెక్ పెట్టొచ్చు..!

Lipid Profile Test

Cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పరిమితికి మించి ఉన్న కొలెస్ట్రాల్ వేళ్లు, అరచేతులు, కాళ్ళు, నడుము, రొమ్ములు, పొట్ట, మెడ, పిరుదులు, మోకాలు, కళ్ళు సహా అనేక భాగాలలో పేరుకు పోతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే వాపునకు దారితీస్తుంది. ఈవిధంగా పేరుకుపోయే కొలెస్ట్రాల్ నిక్షేపాలను ఆంథోమాస్ (Xanthomas) అని కూడా అంటారు. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా కడుపు, రొమ్ము, మెడ, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోతే ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ భాగాల్లో కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

■ ఈ అవయవాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది

★ కళ్ళ చుట్టూ

Xanthomas కొలెస్ట్రాల్ నిక్షేపాల యొక్క అత్యంత సాధారణ రకం పసుపు-నారింజ రంగులో ఉంటుంది. ఇది సాధారణంగా కన్ను, కనురెప్పల చుట్టూ పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి.

★ వేళ్లు , కాలు

ఈ రకమైన కొలెస్ట్రాల్ నిక్షేపాలను ప్లేన్ ఆంథోమాస్ అంటారు.  ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా పేరుకుపోతుంది.ఈ రకమైన కొలెస్ట్రాల్ నిక్షేపాలు వేళ్లు , కాలి దగ్గర కనిపిస్తాయి.

★ అరచేతులు

శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతున్న సంకేతం అరచేతుల్లో కూడా కనిపిస్తుంది. పసుపు కొలెస్ట్రాల్ అరచేతుల క్రింద ఉన్న సిరలలో నిక్షిప్తమవుతుంది. మణికట్టు మరియు అరచేతులు ముడుచుకున్నప్పుడు పసుపు గుర్తులు కనిపిస్తాయి.

★ మోకాలు మరియు మోచేతులు

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సంకేతాలను మోకాలు, మోచేతులు , మడమల నుంచి కూడా గుర్తించవచ్చు. ఈ రకమైన కొలెస్ట్రాల్ నిక్షేపాలను ట్యూబరస్ ఆంథోమాస్ అంటారు.

★ రొమ్ములు

అమ్మాయిలు పెద్ద సైజు రొమ్ములనే ఇష్టపడతారు. కానీ పెద్ద సైజు రొమ్ముల్లో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రొమ్ముతో సహా శరీరంలోని కొన్ని భాగాల్లో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని  ఆరోగ్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు. అధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకునే వారు, శారీరక శ్రమ చేయని వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. శరీరంలో కొవ్వు పేరుకు పోయినప్పుడు శరీర ఆకారం మారుతుంది.

★ పిరుదులు

పిరుదులు, తొడల్లో కొద్దిగా కొవ్వు పేరుకుపోయినా పెద్దగా వచ్చే సమస్య ఏం లేదు. కానీ అక్కడి కండరాలపై ఒత్తిడిని తెచ్చేంత కొవ్వు పేరుకుపోకూడదు. ఫ్లోరిడా సాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని  డయాబెటిస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెనుక భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. సాధారణంగా గుండెపోటుకు గురయ్యే మహిళల్లో వీపు భాగంలో కంటే పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం వల్ల డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

★ పొట్ట భాగంలో కొవ్వు

చెడు కొవ్వు అనేది కడుపు, నడుము భాగంలో ఎక్కువగా పేరుకుపోతుంది. దీనివల్ల వీపు కంటే నడుము, కడుపు చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వాళ్లకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నడుము చుట్టుకొలతను తగ్గించడానికి మీరు కార్బోహైడ్రేట్ల తీసుకోవడం తగ్గించాలి. అలాగే ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడం పెంచాలి. సరైన వ్యాయామం చేయాలి.

★ మెడ భాగంలో కొవ్వు

చాలా మందికి మెడ భాగంలో కూడా  కొవ్వు పేరుకుపోతుంది. కానీ ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది. లేదా ఇంతకు ముందే గుండె సమస్యలు ఉంటే.. అవి ఇంకా ఎక్కువవుతాయి. ఊపిరితిత్తుల సమస్యలు,  నిద్ర రుగ్మతలు కూడా రావొచ్చు. అలాగే హార్మోన్లు హెచ్చు తగ్గులకు లోనవుతాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి.

★బాడీ పై భాగంలో కొవ్వు ఎక్కువ ఉంటే ఏం చేయాలి..?

అధిక బ‌రువు ఉన్న వారు ఎవ‌రైనా త‌మ‌కు నిర్దిష్ట‌మైన భాగంలో ఉన్న కొవ్వును బ‌ట్టి అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంద‌రికి శ‌రీరం కింది భాగంలో ఎలాంటి కొవ్వు ఉండదు. కింది భాగం స్లిమ్‌గానే ఉంటుంది. కానీ పై భాగం మాత్రం కొవ్వు చేరి లావుగా అవుతుంది. అవ‌స‌రం ఉన్న ఆహారం క‌న్నా అధికంగా తింటే ఇలా కొవ్వు పేరుకుపోతుంది. అయితే వీరు కొవ్వు క‌రిగేందుకు ఏం చేయాలంటే.. ఎరోబిక్ ఎక్స‌ర్‌సైజ్‌లు, వాకింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాల‌ను నిత్యం కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. చ‌క్కెర ఉండే తీపి ప‌దార్థాల‌ను తిన‌రాదు. ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి వాటి వ‌ల్ల కొంద‌రికి బాన పొట్ట వ‌స్తుంది. ఇలాంటి వారు ఒత్తిడి, డిప్రెషన్‌ను త‌గ్గించుకునే యోగా, వ్యాయామాలు చేయాలి. గ్రీన్ టీ వంటివి రోజూ తాగుతుంటే బాన పొట్ట క‌రుగుతుంది.

★ గ్లూటెన్ లేని ఫుడ్స్ బెస్ట్

గ్లూటెన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాల‌ను తినే వారికి శ‌రీరం పై భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి వారు గ్లూటెన్ లేని ఫుడ్స్ తింటే మంచిది. కొవ్వు, అధిక బ‌రువును తగ్గించుకోవ‌చ్చు. వాకింగ్, యోగా వంటి వ్యాయామాలు చేసినా ఈ కొవ్వు క‌రుగుతుంది. వీరు ఉద‌యం అల్పాహారం మాత్రం క‌చ్చితంగా తీసుకోవాలి. మానేయ‌రాదు. కొంద‌రికి శ‌రీరం మొత్తం బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ఎప్పుడూ ఉబ్బి క‌నిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే.. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల ఇలా పొట్ట ఉబ్బుతుంది. క‌నుక వీరు మ‌ద్య‌పానం మానేయాల్సి ఉంటుంది. అలాగే రోజూ త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

★ కాళ్లు, న‌డుం ద‌గ్గ‌ర కొవ్వు ఉంటే ఏం చేయాలి..?

కాళ్లు, న‌డుం ద‌గ్గ‌ర కొవ్వు ఉండ‌డం అంటే.. ఎక్కువ‌గా మ‌హిళ‌ల‌కు ఇలాంటి స‌మ‌స్య వ‌స్తుంది. గ‌ర్భంతో ఉన్న స‌మ‌యంలో ఇలా మ‌హిళ‌లు మారుతారు. వీరు ఆహారంలో ఉప్పును త‌గ్గించాలి. దీంతో ద్ర‌వాలు క‌రిగిపోతాయి. బ‌రువు త‌గ్గుతారు. అలాగే ప్ర‌తి 30 నిమిషాల‌కు ఒకసారి లేచి అటు ఇటు తిర‌గాలి. ఒక్క చోటే కూర్చుని ఉండ‌రాదు. రాత్రి సమ‌యంలో కాళ్ల కింద దిండ్లు పెట్టుకుని నిద్రించాలి. శారీర‌క శ్ర‌మ చేయ‌ని వారికి ఇలా పొట్ట, వీపు భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. వీరు రోజూ త‌గినంత నిద్ర పోవాలి. అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారం తినాలి. ర‌న్నింగ్‌, వాకింగ్ వంటి వ్యాయామాలు రోజూ చేయాలి. దీంతో అధిక కొవ్వు, బ‌రువు త‌గ్గిపోతాయి. ఇలా శ‌రీరంలో ప‌లు భాగాల్లో ఉన్న కొవ్వుకు భిన్న‌మైన మార్గాల‌ను పాటించాలి. అప్పుడే కొవ్వు క‌రిగి బరువు త‌గ్గుతారు.