Site icon HashtagU Telugu

Control Cholesterol with Onions: ఉల్లిపాయలతో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందా? షుగర్ రోగులకు మంచిదా?

Onions Benefits

Onions Benefits

ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లి తినడం, కొలెస్ట్రాల్ (Cholesterol) మధ్య సంబంధం ఉంటుంది. ఉల్లిపాయలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మితిమీరి ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉల్లిపాయలు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయో తాజా పరిశోధనలో తేలింది.

ఎర్ర ఉల్లిపాయలు..

రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ జర్నల్ ” ఫుడ్ అండ్ ఫంక్షన్‌” లో ఇటీవల ఒక రీసెర్చ్ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఇది ఎర్ర ఉల్లిపాయలను తినడం గుండెకు మంచిదని సిఫార్సు చేసింది. చైనా పరిశోధకులు ఉల్లిపాయలతో ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈవిషయం గుర్తించారు. పరిశోధనా బృందం ప్రకారం.. ఉల్లిపాయలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే చిట్టెలుకల శరీరంలో “మంచి కొలెస్ట్రాల్” (Good Cholesterol) పెరిగింది. ఈక్రమంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది. ఉల్లిపాయలు తినే ఎలుకల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు నాలుగు నుంచి ఎనిమిది వారాలలో వరుసగా 11.2 శాతం నుంచి 20.3 శాతం మేర తగ్గాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉల్లిపాయల వల్ల ప్రయోజనం పొందొచ్చని అనేక పరిశోధనల్లో తేలింది. గ్లైసెమిక్ ఇండెక్స్ 10 మాత్రమే.. ఇది తక్కువగా ఉంటుంది. ఇందులో చాలా తక్కువ కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. మీ గుండె ఆరోగ్యానికి ఉల్లిపాయలు అద్భుతమైనవి. మీ ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి సైతం పెరుగుతుంది.  ఉల్లిపాయ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియా ముప్పులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయ పడతాయి. సలాడ్‌లను పచ్చి ఉల్లిపాయలతో రుచి చూడొచ్చు. శాండ్‌విచ్‌లను ముక్కలు చేసిన పచ్చి ఉల్లిపాయలతో తినొచ్చు.  ఇది సలాడ్‌గా లంచ్ , డిన్నర్‌కు అనుకూలంగా ఉంటుంది.

ధమనుల గోడలలో కొలెస్ట్రాల్ (Cholesterol)..

ధమనుల గోడలలో కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఫలితంగా ధమనులు ఇరుకుగా మారుతాయి. దీనివల్ల వాటిలో నుంచి రక్తం సరఫరా సాఫీగా జరగదు. పర్యవసానంగా ఇతర శరీర భాగాలతో పాటు మీ గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగితే ధమనులను పూర్తిగా మూసివేస్తుంది. దీన్ని చెక్ చేయకుండా వదిలేస్తే గుండెపోటు వచ్చే ముప్పు ఉంటుంది.  మీరు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం ద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చు.కూరగాయలు, ఫ్రూట్స్ ద్వారా శరీరంలో “మంచి కొలెస్ట్రాల్” వృద్ధి చెందుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read:  Criticism on Suryakumar: బలహీనతలు అధిగమిస్తేనే.. సూర్యకుమార్ వన్డే ఫాం పై విమర్శలు