Site icon HashtagU Telugu

Home remedy for cholesterol : వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది..!!

Images

Images

ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధానకారణంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడమేనని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు మార్కెట్లోఎన్నో రకాల ఉత్పత్తులు ఔషధాలున్నాయి. కానీ వాటితో ఆశించిన ఫలితాలు రాబట్టలేము. మనం రోజు తీసుకునే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయపడవచ్చు. ఈ నాలుగు రకాల కూరగాయలతో కొలెస్ట్రాల్ ను నియంత్రణ ఉంచుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.

వీటిని ఆహారంలో చేర్చుకోండి…
ఆకుపచ్చ కూరగాయలు
శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఆకపచ్చ కూరగాయలు ఎంతో సహాయపడతాయి. వంకాయ, ఓక్రాలో కరిగే ఫైబర్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచడంలో సహాయపడతాయి.

వెల్లుల్లి
రోజూ రెండు వెల్లుల్లిపాయలు తింటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే అల్లిసిన్ ఎల్ డిఎల్ స్థాయిని నిర్వహించడానికి చక్కగా పనిచేస్తుంది. రాత్రి ఉదయం తప్పనిసరిగా రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు ఆహారంలో చేర్చుకోండి.

ఆమ్లఫలాలు
కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సిట్రస్ పండ్లు, యాపిల్స్, బెర్రీలు, నారింజ, నిమ్మకాయలు తీసుకోవాలి. ఇందులో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

పురుషులకు ఖర్జూరం
ఖర్జూరం తినడం వల్ల పురుషుల కండరాలు ధ్రుఢంగా ఉంటాయి. అంతేకాదు అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

పసుపు
పసుపుతో కూడా కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దీని వినియోగం వల్ల చెడు కొలెస్ట్రాల్ మూత్రం రూపంలో బయటకు వెళ్తుంది. రాత్రిపూట పసుపుపాలు తాగడం వల్ల శీఘ్ర ప్రయోజనాలు లభిస్తాయి. రోజువారీ ఆహారంలో పసుపు తప్పకుండా తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version