Pig Liver : ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా మనుషుల శరీరంలో పందుల కిడ్నీలు, గుండెను అమర్చారు. తాజాగా మనిషి శరీరంలో పంది లివర్‌ను అమర్చాను. చైనా డాక్టర్లు తొలిసారిగా ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన 50 ఏళ్ల వ్యక్తి శరీరంలో పంది కాలేయాన్ని అమర్చామని వారు వెల్లడించారు. ఎంపిక చేసిన పందులకు చైనా సైంటిస్టులు జన్యు సవరణలు చేశారు. దీంతో వాటికి జన్మించిన పంది పిల్లల లివర్ సైజు, మనిషి లివర్ సైజుతో సరిసమానంగా ఉంది. ఈ పంది పిల్లలను ప్రత్యేక షెడ్లలో పెంచారు. ఆ గుంపులోని ఒక పంది నుంచి సేకరించిన లివర్‌ను.. ఇటీవలే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరంలో అమర్చారు. చైనాలోని జియాన్‌లో నాలుగో మిలిటరీ మెడికల్ యూనివర్సిటీ వైద్యులు ఈ సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు.
Also Read :LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ.. ఆ కంపెనీలో వాటా కొనుగోలు ?
కాలేయ దాతలు దొరికే వరకు..
తీవ్ర కాలేయ సమస్యలతో బాధపడుతున్న రోగులకు, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం కాలేయ (Pig Liver) మార్పిడి సర్జరీ చేయడం అవసరం. ఇందుకోసం తొలుత కాలేయ దాతలు దొరకాలి. అంత ఈజీగా ఎవరూ కాలేయ దానానికి సిద్ధపడరు. ఎందుకంటే మనిషి శరీరంలో గుండెకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, కాలేయానికీ అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ లోటును పూడ్చేందుకు పంది కాలేయాలు ఉపయోగపడతాయని చైనా డాక్టర్లు అంటున్నారు. కాలేయ దాత దొరికే వరకు పంది కాలేయంతో కాస్త ఉపశమనాన్ని పొందొచ్చని చెబుతున్నారు. గతంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్లు ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చగా 40 రోజులు బతికాడు.
Also Read :Salman Vs Lawrence: లారెన్స్ హత్య బెదిరింపులు.. ఫస్ట్ టైం సల్లూ భాయ్ రియాక్షన్
రంగంలోకి దొంగల బ్యాచ్.. 100 పందుల చోరీ
తాజాగా బెంగళూరు శివార్లలోని దొడ్డబల్లాపురాలో భారీ చోరీ జరిగింది. ఆరుగురు దొంగలతో కూడిన ఒక బ్యాచ్ ఏకంగా 100 పందులను అపహరించింది. వరుసగా రెండు రాత్రుల్లో.. రెండు వేర్వేరు పందుల షెడ్ల నుంచి మొత్తం 100 పందులను ఎత్తుకెళ్లారు. వాటిని తీసుకెళ్లే ఓ పంది పిల్లను వదిలి వెళ్లారు. దానికి గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి ఈమేరకు దొడ్డబల్లాపుర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. చోరీకి గురైన 100 పందుల విలువ దాదాపు రూ.8 లక్షలు ఉంటుందని తెలిపారు.