Monkey Pox : చైనాకు మంకీ పాక్స్‌ద‌డ

  • Written By:
  • Updated On - May 31, 2022 / 01:54 PM IST

చైనా దేశాన్ని మంకీ ఫాక్స్ హ‌డ‌లెత్తిస్తోంది. అందుకే, కోవిడ్ -19 నియంత్ర‌ణ‌కు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న ఆ దేశం మంకీ పాక్స్‌ విష‌యంలో తీవ్ర‌మైన చ‌ర్య‌ను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఆ దేశానికి వెళ్లే వాళ్ల ఆరోగ్య ప‌రిస్థితుల‌ను స‌మీక్షించే బాధ్య‌త‌ల‌ను క‌స్ట‌మ్స్ అధికారుల‌కు అప్ప‌గించారు. మంకీ ఫాక్స్ వైర‌స్ చైనా దేశానికి రాకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కస్ట‌మ్స్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ప‌లు ర‌కాలు వ‌స్తువులను ప‌రిశీలిస్తున్నారు. ఎలుక‌ల‌ను నియంత్రించ‌డానికి క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు.

చైనా కస్టమ్స్ అధికారులు పోర్ట్‌ల ద్వారా మంకీపాక్స్ వైరస్ ను నిరోధించడానికి ప్రయత్నాలు చేశారని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జిఎసి) తెలిపింది. శరీర ఉష్ణోగ్రత పర్యవేక్షణ , ప్ర‌యాణికుల కోసం వైద్య తనిఖీలతో సహా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు జిఏసీ చెప్పింది. ప్ర‌యాణీకుల‌ వస్తువులు, ఎలుకల నిర్బంధాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు క‌ఠిన‌త‌రం చేశారు. అలాగే ప్రయోగశాలల బయోసేఫ్టీ నిర్వహణను మెరుగుపరిచారు. మంకీ ఫాక్స్ కేసుల ప్రమాదాన్ని ఖచ్చితంగా నిరోధించడానికి GAC ఇతర ప్రభుత్వ విభాగాలతో కూడా సమన్వయం చేసుకుంది. అవుట్‌బౌండ్ మరియు ఇన్‌బౌండ్ ప్రయాణికులు అనారోగ్యంతో బాధపడుతుంటే లేదా జ్వరం, తలనొప్పి, కండరాలు ఇత‌ర‌త్రా లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా కస్టమ్స్ అధికారులకు నివేదించాలని GAC తెలిపింది.