Health : రోజూ చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా…షాకింగ్ విషయాలు బయటపడ్డాయి…!!

చికెన్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చికెన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ మీరు రోజువారీ పరిమితికి మించి చికెన్ తింటే, అది మీ అనారోగ్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - August 6, 2022 / 09:00 AM IST

చికెన్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చికెన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. కానీ మీరు రోజువారీ పరిమితికి మించి చికెన్ తింటే, అది మీ అనారోగ్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను ఇక్కడ తెలుసుకుందాం.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది
మీరు సరైన మొత్తంలో చికెన్ తింటే, మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయికి ఎటువంటి సమస్య ఉండదు. కానీ పరిమితికి మించి తింటే మాత్రం ప్రమాదమని చెబుతున్నారు. డీప్ ఫ్రైడ్ చికెన్‌ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో నివేదించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కోడి మాంసం అధికంగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి మీరు మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ లో ఉంచడానికి నూనెలో వేయించిన చికెన్ కాకుండా, గ్రిల్డ్ , ఉడికించిన, కాల్చిన చికెన్ తీసుకోవడం మంచిది.

చికెన్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించే ఆహార పదార్థం. కాబట్టి శరీరంలో అధిక ఉష్ణోగ్రతను కలిగిస్తుంది. దీని వల్ల తరచుగా జలుబు వస్తుంది. ఇది ముఖ్యంగా వేసవిలో జరుగుతుంది.
రోజూ చికెన్ తినేవాళ్లు ఇది మామూలే అంటారు. అయితే అలాంటి పరిస్థితి వస్తే కొన్ని రోజులు చికెన్ వినియోగానికి దూరంగా ఉండటం మంచిది.

శరీర బరువు పెరుగుతుంది
చికెన్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వచ్చే మరో హెల్త్ సైడ్ ఎఫెక్ట్ బరువు పెరగడం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని వారానికి ఒకసారి తీసుకుంటే సరి. కానీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి కూడా పరిమితిని మించిపోతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది
కొన్ని చికెన్ వెరైటీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఒక అధ్యయనం ప్రకారం, చికెన్‌లో E.coli అనే బ్యాక్టీరియా ఉంటుంది. చికెన్ తిన్న తర్వాత చికెన్ తిన్నవారిలో కూడా ఇది కనుగొనబడింది. అధ్యయనాలలో కూడా నిరూపించబడింది. కాబట్టి యాంటీబయాటిక్స్ లేకుండా పెంచిన నాటు కోడి చికెన్ తినడం మంచిది.