మనలో చాలామంది టైం పాస్ కావడం కోసం చూయింగ్ గమ్ ని ఎక్కువగా నములుతూ ఉంటారు. అయితే ఈ చూయింగ్ గమ్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చూయింగ్ గమ్ నమలటం వల్ల నోటి దుర్వాసన సమస్య దూరమవుతుందట. అలాగే చూయింగ్ గమ్ నవలటం వలన ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్సైజ్ అయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుందట. అలాగే ఇది నమలటం వలన ఆకలి కాస్త తగ్గి చిరితుళ్ళకి దూరంగా ఉంటారు. దీనివలన ఆటోమేటిక్గా బరువు తగ్గుతుంది.
చూయింగ్ గమ్ నమలని వారు కనీసం 68 క్యాలరీల ఆహారం అధికంగా తీసుకుంటారు. అలాగే చూయింగ్ గమ్ నమిలే వారిలో ఐదు శాతం వరకు అధిక క్యాలరీలు ఖర్చు అవుతాయని గుర్తించారు. బ్రేక్ ఫాస్ట్ లంచ్ మధ్య విరామంలోనే ఇది పనిచేస్తుందట. చూయింగ్ గమ్ నమలడం వల్ల డబుల్ చిన్ సమస్య తొలగిపోతుందట. చూయింగ్ గమ్ హిప్పోకం పాస్ మెదడులోని భాగాన్ని సక్రియం చేస్తుందని చెబుతున్నారు. అలాగే జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుందట. అలాగే చూయింగ్ నమలడం వల్ల ఒత్తిడిని, చికాకుని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే పసుపు రంగులో ఉండే దంతాలు తెలుపు రంగులోకి మారటానికి చూయింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందట. చాలామంది తమ పిల్లలు చూయింగ్ గమ్ తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదని, మరొకసారి తినొద్దని వార్నింగ్ ఇస్తూ ఉంటారు.
నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నమిలి మింగితే సమస్యలు వస్తాయి కానీ నమిలిన తర్వాత మిగిలిన పదార్థాన్ని బయటకి వూసివేస్తే ఎలాంటి ప్రమాదము ఉండదట. పైగా దీనివల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే మీరు తినవలసింది నార్మల్ చూయింగ్ కాదు. కేవలం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ తినటం వలన పై లాభాలన్నీ పొందవచ్చట. అలాగే నమిలిన తర్వాత దానిని మింగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్నారు.