Urinary Problems: అతి మూత్ర సమస్యకు జనరిక్‌ మెడిసిన్‌ తో చెక్!

ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ఫెసోబిగ్‌ పేరుతో ఫెసోటిరోడిన్‌ ఫ్యూమరేట్‌కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ సమానమైన జనరిక్‌ వర్షన్‌ను తయారు చేసింది.

ఫార్మా రంగ కంపెనీ ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ఫెసోబిగ్‌ పేరుతో ఫెసోటిరోడిన్‌ ఫ్యూమరేట్‌కు సంబంధించి ప్రపంచంలోనే తొలి జీవ సమానమైన జనరిక్‌ (Generic Medicine) వర్షన్‌ను తయారు చేసింది. అతి చురుకైన మూత్రాశయం (Urinary Bladder), మూత్రాన్ని ఆపుకోలేని (Urinary Incontinence) సమస్యకు ఈ ఔషధం చికిత్స లభిస్తుందని అది కూడా అందుబాటు ధర లో లభిస్తుందని ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ ఈడీ భరత్‌ రెడ్డి తెలిపారు.

దేశంలోని స్త్రీ, పురుషుల్లో ఈ సమస్య విస్తృతంగా ఉందని వివరించారు. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన 80 శాతం మహిళల్లో ఎక్కువగా ఉందట. భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆపుకొనలేని సమస్యతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. అవగాహన లేకపోవడంతో వృద్ధాప్యంలో ఇది మామూలే అని అనుకుంటున్నారనీ, ఇది వివిధ వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు.

Also Read:  Pet Dog: యజమాని మృతి చెందినా ఆస్పత్రి వద్దే పెంపుడు శునకం ఎదురుచూపు!