Wrinkles: చాలామందికి చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు వస్తాయి. వయస్సు పెరిగే కొద్ది ముఖంపై మడతలు రావడం వల్ల చర్మం సౌదర్యంగా కనిపించదు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే ముఖంపై మడతలు రావడం వల్ల చూసేవారికి వయస్సు ఎక్కువగా అనిపిస్తుంది. కానీ కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫిట్ నెస్ మెయింటెన్ చేయకపోవడం వల్ల ముఖంపై మడతలు వస్తూ ఉంటాయి.
మన ఇంట్లో లభించే కూరగాయాలు, సరుకుల ద్వారా ఫేస్ ప్యాక్ లు తయారుచేసుకోవచ్చు. అందులో బంగాళదుంప బాగా ఉపయోగపడుతుంది. బియ్యం పిండి, పాలు, బంగాళాదుంప కలిపి ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖాన్ని చాలా కాంతివంతంగా చేస్తాయి. అలాగే చర్మంపై వచ్చే ముడతల్ని కూడా రాకుండా చేస్తాయి.
ఇక ముఖంపై రోజూ పచ్చిపాలను అప్లై చేస్తే ముఖం ప్రకాశంతంగా మెరుస్తూ ఉంటుంది .అలాగే కాంతివంతమైన, మృదువైన చర్యం మీకు వస్తుంది. పాలు చర్మ కణాలను మెరుగ్గా చేస్తోంది. ఇక బియ్యం పిండి వల్ల బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. బంగాళదుంపని తురిమి పిండి వేయాలి. ఆ తర్వాత పాలు పోసి ప్యాక్ లా చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాలు అలాగే ఉంచుకోని ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇక వారానికి ఒకటి లేదా రెండుసార్లు బంగాళదుంప ప్యాక్ వేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.ముఖం కాంతివంతంగా ఉండటమే కాకండా ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. దీంతో మనం కూరల్లో తినే బంగాళదుంప ఇలా ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.