CEREBO Machine : కొత్తగా అభివృద్ధి చేసిన CEREBO అనే పరికరం, బ్రెయిన్ స్వెల్లింగ్, గాయాలను త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది, ఇది MRI, CT స్కాన్‌ల అవసరాన్ని తగ్గించవచ్చు. ఈ పరికరాన్ని డాక్టర్ డేవిడ్ మెయిన్వాల్డ్ (Dr. David Meinwald), నవోమి కోహెన్ (Naomi Cohen) నేతృత్వంలోని పరిశోధనా బృందం కాలిఫోర్నియాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ Cerebrotech Medical Systemsలో తయారు చేసింది.
CEREBO పరికరం ఎందుకు ఉపయోగిస్తారు?
సాధారణంగా, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ స్వెల్లింగ్ లేదా గాయాలను గుర్తించడానికి MRI, CT స్కాన్ వంటి పెద్ద, ఖరీదైన యంత్రాలు అవసరం. కానీ, కొన్నిసార్లు ఈ సేవలు అన్నిచోట్లా అందుబాటులో ఉండవు. CEREBO అనేది పోర్టబుల్, సులభంగా వాడే పరికరం. ఈ పరికరం బ్రెయిన్ లోని ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఫ్లూయిడ్ లెవెల్స్‌ను సెకన్లలోనే గుర్తించి, కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. దీని వలన బ్రెయిన్ డ్యామేజ్ వంటి వాటిని త్వరగా గుర్తించి, చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది. దీనివలన సమయం చాలా వరకు ఆదా అవుతుంది. వైద్యులకు కూడా వెంటనే చికిత్స అందించడానికి వీలు దొరుకుతుంది.
బ్రెయిన్ డ్యామేజ్, ప్రమాదాలను ఎలా గుర్తిస్తుంది?
CEREBO పరికరం, తలపై ఉంచినప్పుడు, బ్రెయిన్ లోకి ఒక తక్కువ పవర్ కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ను పంపిస్తుంది. బ్రెయిన్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్, గాయం లేదా స్వెల్లింగ్ లేనప్పుడు, ఆ సిగ్నల్ ఒక సాధారణ పద్ధతిలో బ్రెయిన్ లోని ఫ్లూయిడ్ లెవెల్స్‌ను కొలుస్తుంది. కానీ, ఒకవేళ బ్రెయిన్ లో బ్లీడింగ్ లేదా ఫ్లూయిడ్ పెరిగినట్లయితే (ఎడెమా), దాని వల్ల బ్రెయిన్ ఫ్లూయిడ్ ఎలక్ట్రికల్ లక్షణాలు మారుతాయి. ఈ మార్పులను CEREBO పరికరం త్వరగా గుర్తించి, అలారం ఇస్తుంది.
ఎంత టైంలో ఫలితాలు వస్తాయి?
ఈ పరికరం గొప్ప ప్రయోజనం ఏమిటంటే, ఇది కేవలం 30 సెకన్ల నుండి 60 సెకన్లలోపే ఫలితాలను ఇస్తుంది. ఇది ఒక పోర్టబుల్ పరికరం కాబట్టి, ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుల్లో, అంబులెన్సుల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో కూడా దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు. త్వరగా రిపోర్ట్ రావడం వలన చికిత్స కోసం సమయం వృథా అవ్వకుండా, తక్షణమే వైద్యం అందించడానికి వీలవుతుంది. తద్వారా ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని వెంటనే కాపాడటానికి వీలవుతుంది.
ఈ CEREBO పరికరం బ్రెయిన్ డ్యామేజ్‌ను త్వరగా గుర్తించడంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుంది. దీని వలన బ్రెయిన్ స్ట్రోక్, హెడ్ ఇంజరీస్, మరియు ఇతర న్యూరోలాజికల్ సమస్యలను త్వరగా, సమర్థవంతంగా పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పరికరం డాక్టర్లకు త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనివలన రోగుల ప్రాణాలను కాపాడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.