Health: విటమిన్ డితో అనేక రోగాలకు చెక్, అవి ఏమిటో తెలుసుకోండి

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 04:54 PM IST

Health: విటమిన్ డి లోపం వల్ల కలిగే పెల్లాగ్రా అనే చర్మవ్యాధితో బాధపడే వాళ్లు రోజూ 20 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతిలో నిలబడితే కొన్ని రోజుల్లోనే ఇది సాధారణ స్థితికి చేరుకుంటుంది. నల్లజాతీయుల్లో ప్రొస్టేట్ కేన్సర్ ప్రబల వ్యాధిగా మారడానికి సూర్యరశ్మి లోపమే ముఖ్య కారణం. కాల్షియం పేగుల్లో శోషణం చెందడానికి విటమిన్ డి చాలా అవసరం. తగినంత మోతాదులో ఈ విటమిన్ స్థాయిలు లేకపోతే కాల్షియం శోషణం చెందదు, దీని వల్ల శరీరంలోకి చేరిన కాల్షియం నిరుపయోగంగా మారుతుంది.

దీర్ఘకాలికంగా ఉన్న ఈ విటమిన్ లోటు భర్తీ ఒక్క రోజుతో సాధ్యం కాదు. సూర్యకాంతి ద్వారా శరీరంలోని ప్రవేశించే విటమిన్ డి ఎముకలు, నరాల వ్యవస్థలో పునర్మిణానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. ఒకవేళ సూర్యకిరణాలు స్థాయి బలహీనంగా ఉంటే విటమిన్ డి తయారు చేసే సామర్థ్యాన్ని శరీరం 95 శాతం కోల్పోతుంది. దీంతో విటమిన్ లోపం వల్ల రోగాలకు కారణమవుతాయి.

శరీరానికి ఎంత మేర అవసరమో అంతే మొత్తంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి ని గ్రహిస్తుంది తప్ప ఎక్కువ స్థాయిలో తీసుకోవడం సాధ్య పడదు. ఉరోస్థి (గుండె/ ఊపరితిత్తులు ఉండే ఎముకల గూడు) నొప్పి అధికంగా ఉంటే విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నట్లే.

విటమిన్ డి శరీరం వినియోగించుకునే ముందు మూత్రపిండాలు, కాలేయం ద్వారా ఉత్తేజితమవుతుంది. మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ సమస్యలు తలెత్తినప్పుడు విటమిన్ డి సక్రమంగా అందకపోతే శరీరం యొక్క సామర్థ్యం బలహీనమవుతుంది. ఎంత మొత్తంలో శరీరానికి సూర్యరశ్మి అవసరమో తెలుసుకుంటే సన్‌స్క్రీన్ ఉత్పత్తి పరిశ్రమల అమ్మకాలు అమాంతం తగ్గిపోతాయి.