Site icon HashtagU Telugu

PCOD: పీరియడ్స్ సరైన సమయానికి రావడం లేదా..అయితే మీ లైఫ్ స్టైల్ ను మార్చుకోండి..!!

Irregular Periods

Irregular Periods

మహిళ్లల్లో ఎక్కువ వచ్చే సమస్య రుతుక్రమం సరిగ్గా రాకపోవడం. దీనిని PCOD లేదా PCOS అంటారు. ఇది ప్రతి మహిళలో సాధారణం అయినప్పటికీ దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పీసీఓడీ సమస్యను మొదట్లోనే గుర్తించినట్లయితే…సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు.

పీసీఓడీ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి…
* తరచుగా మూడ్ స్వింగ్స్
* హర్మోన్లు హెచ్చు తగ్గులు
* అవాంఛిత రోమాలు పెరగడం
* థైరాయిడ్ సమస్య

PCODని నయం చేయడంలో పౌష్టికాహారం ముఖ్యం. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడపవచ్చు. యాపిల్, పుచ్చకాయ, అరటిపండు, స్ట్రాబెర్రీ, అవకాడో, బచ్చలికూర, కొత్తిమీర, క్యారెట్, బీట్‌రూట్, చిక్కుళ్ళు, చేదు పొట్లకాయ, బీన్స్ వంటి ఆహారాలను నిత్యం ఆహారంలో తీసుకోవాలి.

మంచి నిద్ర:
సరైన హార్మోన్లు ఉత్పత్తి కావాలంటే శరీరానికి విశ్రాంతి అవసరం. కాబట్టి రోజూ 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోవడం మంచిది. PCODకి దారితీసే ఒత్తిడిని అధిగమించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సరైన నిద్ర అనేది చాలా అవసరం.

శారీరక శ్రమ:
అధిక బరువు కూడా PCOD కారణం కావచ్చు. బరువును సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యం. వయసు, ఎత్తును బట్టి శరీర బరువును ఉంచుకుంటే హార్మోన్ల ఉత్పత్తి కూడా సరిగ్గా జరుగుతుంది. అందుకని శరీర బరువు అధికంగా ఉంటే దాన్నికంట్రోల్ చేసుకునేందుకు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. వ్యాయామం అనేది చాలా అవసరం.

యోగాసనాలు

* సర్వంగాసనం/ శిర్షాసనం
* వజ్రాసనం
* శశాంకసన
* హలాసానా

శరీరానికి చెమట పట్టేలా వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ కూడా చెమట ద్వారా బయటకు వెళ్తాయి.