Site icon HashtagU Telugu

Battle Rope Workout: సెలెబ్రిటీల ఫేవరేట్ వర్కవుట్ ఏంటో తెలుసా…?

Deepika

Deepika

అందం, ఆరోగ్యం, ఫిట్ నెస్…ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. బయటకు కనిపించకుండా ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయి. ఫిట్ నెస్ సాధించాలంలే…వర్క్ వుట్స్ పై ఆధారపడతారు. యోగా చేసేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు జిమ్ లో సెలబ్రిటీలు హాట్ వర్కవుట్ ఏంటో తెలుసా? బ్యాటిల్ రోప్ వర్కవుట్. రెండు తాళ్లను పట్టుకుని ఆగకుండా…ఊపడం. సమంత నుంచి దీపికా వరకు ఎంతో మంది తారలు రోజూ చేసే వర్కవుట్ ఇదే. దీనికి వాడే తాడు సన్నగా కాదు..లావుగా ఉంటుంది. చేత్తో పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటిది చాలా సేపు తాళ్లను పట్టుకుని ఊపాలంటే కష్టమే మరి. చెమటలు పట్టడం కాదు..కొవ్వు కూడా కరిగిపోతుంది. బరువు తగ్గేందుకు ఈ వర్కవుట్ బెస్ట్ ఛాయిస్ అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.

ఈ తాళ్లు మందం, పొడవుతో లభిస్తాయి. తాడు వెడల్పు ఆధారంగా బరువును నిర్ణయిస్తారు. తాడును ఎత్తి కుదిపేందుకు చాలా బలం అవసరం అవుతుంది. షుగర్ ఉన్నవారు మొదట్లో 1 నుంచి 1.5 అంగుళాల తాడును ఉపయోగించుకోవచ్చు. తర్వాత మెల్లగా రెండు లేదా రెండున్నర అంగుళాల తాడుకు మారవచ్చు.

ఈ తాడు వర్కవుట్ చేసేందుకు స్క్వాట్ పొజిషన్లో నిలుచోని చేయాలి. మోకాళ్లు కొంచెం కిందికి చాచీ నిటారుగా ఉంచాలి. భూమి నుంచి ఎంత పైకి ఎత్తి ఆడిస్తే…అంత కెలోరీలు బర్న్ అవుతాయి. ఇలా చేసినట్లయితే శరీరం మంచి షేప్ కి వస్తుందంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.

Exit mobile version