Site icon HashtagU Telugu

Heart Burn: రాత్రిపూట గుండెల్లో మంటగా ఉంటోందా.. అయితే ఇది మీకోసమే!

Heart Attack

Heart Attack

ఇటీవల కాలంలో గుండెల్లో మంట అన్నది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. తిన్నది సరిగా అరగకపోవడం, అజీర్ణం, అజీర్తి, కడుపు సమస్యల వల్ల గుండెల్లో మంట సమస్య వస్తూ ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు గుండె సమస్యలు కూడా రావచ్చు. గుండెల్లో కారణంగా రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగా పట్టదు. ఈ సమస్యకు చాలా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలాగె ఈనో వంటి గ్యాస్ ఉండే లిక్విడ్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం అనిపించినప్పటికీ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉంటుంది.

మరి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు నిద్రించే భంగిమ సరిగ్గా ఉంటే హార్ట్ బర్న్ సమస్యను ఖచ్చితంగా నివారించవచ్చట. మీ వెనుక లేదా మీ కుడి వైపున పడుకోవడం వల్ల గుండెల్లో మంట మరింత తీవ్రమవుతుందట. కాబట్టి రాత్రిపూట ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే రాత్రిపూట ఎక్కువగా తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు మీ రాత్రి ఆహారపు అలవాట్లను సరిచేసుకుంటే, మీరు గుండెల్లో మంట సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చట.

ఇందుకోసం రాత్రిపూట కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడదని, మసాలాలు కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదని చెబుతున్నారు. మీరు నిద్రించడానికి 2 నుంచి 3 గంటల ముందు మీ భోజనం ముగించాలట. అలాగే తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలట. అది ఆరోగ్యానికి మంచిదట. టమోటాలు, సిట్రస్ పండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. గుండెల్లో మంటకు ప్రధాన కారణాలు కెఫిన్ , ఆల్కహాల్ తీసుకోవడం. అందువల్ల, మీరు కాఫీ, టీ , కెఫిన్, ఆల్కహాల్, శీతల పానీయాలు త్రాగడానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే అజీర్ణం, గుండెల్లో మంటకు ఒత్తిడి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం ఎక్కువ కడుపు ఆమ్లాన్ని విడుదల చేస్తుందట. కొన్ని శ్వాస వ్యాయామాలు, ధ్యానం, యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. పైన చెప్పిన విషయాలు పాటించినప్పటికీ గుండెల్లో మంట అలాగే వేధిస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.