చాలామందికి పడుకున్నప్పుడు నోట్లో నుంచి ఇలా అలా చేయడం బయటికి రావడం అన్నది సహజం. దీనినే కొన్ని ప్రాంతాలలో జొల్లు అని కూడా అంటూ ఉంటారు. ఈ సమస్య కేవలం చిన్న పిల్లల్లో మాత్రమే కాకుండా పెద్దవాళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కొందరికి పెద్ద అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం అలాగే ఉంటుంది. చాలామంది ఇలా వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ ఇది రకమైన ఆరోగ్య సమస్య అని చెబుతున్నారు. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అన్న విషయానికి వస్తే.. నిద్రపోతున్నప్పుడు నోట్లోంచి లాలాజలం వస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న పిల్లలకు దంతాలు లేకపోవడం, లేదా వస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది.
కాబట్టి ఇది వారికి సర్వసాధారణం. కానీ పెద్దలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాం. అలాగే పడుకున్న కొద్దిసేపటి తర్వాత కొంతమంది నోట్లోంచి లాలాజలం బయటకు వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇది ఎక్కువగా వస్తే మరికొంతమందికి మాత్రం తక్కువగా వస్తుంది. మీ నోట్లోంచి లాలాజలం కారుతుంటే హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోవాలట. నిజానికి ఈ సమస్య మనకున్న చెడు అలవాట్ల వల్ల కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. లేదా మీకున్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతుందని నిపుణులు అంటున్నారు.
మీకు ఏదైనా అలెర్జీ ఉన్నా కూడా మీరు పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతుందట. దగ్గు, జలుబు, గొంతు సమస్య, శ్వాసకోశ వ్యాధి వంటి ఇతర సమస్యల వల్ల కూడా నోట్లోంచి లాలాజలం కారుతుందట. ఏవైనా జీర్ణసమస్యలు, ఉదర సమస్యలు, అజీర్ణం వంటి సమస్యల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. నిద్రలేమి కూడా లాలాజలం సమస్యను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా బయట తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందట. మానసిక సమస్యలు కూడా ఇందుకు దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే ఆమ్ల ఆహారాన్ని ఎక్కువగా తింటే కూడా ఈ సమస్య వస్తుందట. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అన్న విషయానికి వస్తే.. మీరు పడుకున్నప్పుడు నోట్లోంచి లాలాజలం కారుతున్నట్టైతే గోరువెచ్చని నీటితో నోటిని పుక్కలించడం మంచిది. అలాగే ప్రతి రోజూ తులసి ఆకులను తినాలి. లేదా వేడి నీటిలో ఉసిరి పొడి వేసి తిన్న తర్వాత ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
note : పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.