Site icon HashtagU Telugu

Cauliflower: అతిగా కాలీఫ్లవర్ తింటున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 08 Feb 2024 03 27 Pm 7338

Mixcollage 08 Feb 2024 03 27 Pm 7338

కాయగూరలలో ఒకటైన కాలీఫ్లవర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ కాలీఫ్లవర్ ని ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ కాలీఫ్లవర్ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. అయితే కాలీఫ్లవర్ ఆరోగ్యానికి మంచిదే కదా అని తరచుగా తీసుకోవడం అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. మరి కాలిఫ్లవర్ ను అధిక తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుండె జబ్బులు ఉన్నవాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. ఇది గాయాల లేక దెబ్బల వల్ల కలిగే వాపు మంట నొప్పులను తగ్గిస్తుంది.

కాబట్టి ఇన్ఫల్మేషన్ తగ్గాలనుకున్న వారిని దీన్ని సిఫార్సు చేయవచ్చు. డయాబెటిస్, పక్షవాతం, మెదడ కు సంబంధించిన అల్జీమర్ లాంటి వ్యాధులను ఇది నివారిస్తుంది. కాగా అనేక రకాల పోషకాలు కాలిఫ్లవర్ లో ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ల తోను సమర్థంగా పోరాడుతాయి. అందుకే క్యాన్సర్ నివారణగా కాలీఫ్లవర్ కు మంచి పేరు ఉంది. శరీరంలో పేర్కొన్న విషాలను, వ్యర్ధాలను సమర్ధంగా శుభ్రం చేస్తుంది. అందుకే దూర అలవాట్లు ఉన్నవారు లేదా వాటిని మానేసిన వారు ఒంట్లోని విష పదార్థాలను దూరం చేసుకునేందుకు దీన్ని వాడటం మంచిది.

క్యాలీఫ్లవర్ లో సహజంగా ఫైబర్ బి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది ఆంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది. ఇవి కాన్సర్ నుండి రక్షించగలవు. బరువు తగ్గేందుకు జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఫైబర్ జ్ఞాపక శక్తికి అవసరమైన కోలిన్ అనేక ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అయితే చాలా ఎక్కువగా కాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ప్రత్యేకించి దీన్ని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం అపాన వాయువు సమస్య వస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఉబ్బరం అపాన వాయువును పెంచుతాయి. అయినప్పటికీ ఈ ఆహారాలను మితంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే కాలీఫ్లవర్ ను డైట్ లో జోడించడం సులభం. ఇది రుచికరమైనది.. వండడం సులభం.