కాలిఫ్లవర్(Cauliflower )ను ఎక్కువగా మనం గోబీ మంచూరియా, గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ 65 వంటి ఫాస్ట్‌ఫుడ్ వంటకాల రూపంలోనే తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా తయారు చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి కావు. కాలిఫ్లవర్‌ను ఉడికించి కూరగా లేదా సూప్‌గా తీసుకోవడం వల్లనే దాని పూర్తిస్థాయి పోషక విలువలు శరీరానికి లభిస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పోషకాహార లోపాన్ని తగ్గించడమే కాకుండా, అనేక వ్యాధులనూ నివారించగలదు.
AP Govt : స్కూళ్లకు కీలక ఆదేశాలు..
కాలిఫ్లవర్‌లో ఫైబర్, విటమిన్ సి, కె, బి9, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి అనేక మూలకాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీర కణాలను రక్షించడంతోపాటు, ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ వంటి జబ్బులకు అడ్డుకట్ట వేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ కలిగి ఉండి ఆకలిని నియంత్రించగలదు. ఇది బరువు తగ్గే వారికి ఎంతో సహాయపడుతుంది.
కాలిఫ్లవర్‌లో ఉన్న కోలిన్ మెదడుకు చాలా అవసరమైన పోషకంగా పనిచేస్తుంది. ఇది మెదడులో న్యూరాన్ నిర్మాణానికి తోడ్పడడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గించే శక్తిని కలిగిస్తుంది. అంతేకాదు, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడి హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది. ఈ ప్రయోజనాలన్నింటిని చూసిన తర్వాత, కాలిఫ్లవర్‌ను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.