Site icon HashtagU Telugu

Carrot : క్యారెట్ వర్సెస్ క్యారెట్ జ్యూస్.. ఏది మంచిది?

Carrot or carrot juice which is better for health

Carrot or carrot juice which is better for health

క్యారెట్(Carrot) ని చాలా మంది పచ్చిగా తింటారు. కొంతమంది జ్యూస్(Juice) తాగుతారు. ఇక ఇంట్లో కూర, సాంబార్, పలావ్ లో వేసుకొని తింటాము. క్యారెట్ ను ఏ విధంగా తిన్నా మన ఆరోగ్యానికి(Health) చాలా మంచిది. క్యారెట్ లో అనేక పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

క్యారెట్ ను పచ్చిగా విడిగా తినడం వలన మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. క్యారెట్ ను విడిగా తినడం వలన అది మన నోటిలో లాలాజలం వచ్చేలా చేస్తుంది. ఇది మన శరీరంలో మనం తిన్న ఆహార పదార్థాలను తొందరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. క్యారెట్ ను విడిగా తినడం వలన అది మన నోటికి వ్యాయామం కలిగేలా చేస్తుంది. మనకు రెండు క్యారెట్లు తినడానికి పావుగంట సమయం పడితే అదే క్యారెట్ జ్యూస్ తాగడానికి ఒక రెండు నిముషాల సమయం పడుతుంది.

ఎవ్వరైనా సరే రోజూ ఉదయం ఒక క్యారెట్ తినవచ్చు లేదా మనకు ఖాళీ ఉన్న సమయంలో ఎప్పుడైనా రోజుకు ఒకసారి ఒక క్యారెట్ తినవచ్చు. ఈ విధంగా రోజూ క్యారెట్ ను తినడం వలన మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మనకు అలసటగా ఉన్నప్పుడు క్యారెట్ తిన్నా మనకు శక్తి వస్తుంది. క్యారెట్ మన శరీరంలోని ఎముకలకు బలాన్ని అందజేస్తాయి. కాబట్టి క్యారెట్ ను మనం రోజూ విడిగా తినడం వలన మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

 

Also Read : Dark Circles: అరటిపండుతో ఇలా చేస్తే చాలు.. డార్క్ సర్కిల్స్ మాయం?