Health: క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి జోష్

  • Written By:
  • Updated On - November 18, 2023 / 05:56 PM IST

Health: క్యారెట్ ను తినడమే కాకుండా జ్యూస్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్యారెట్ జ్యూస్ లో మీ కళ్ళకు ప్రయోజనం కలిగించే అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. క్యారెట్ జ్యూస్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్యూస్ లోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చిన్న మొత్తంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లోని పోషకాలు చర్మ ఆరోగ్యానికి ప్రయోజకరంగా ఉంటాయి.

క్యారెట్ జ్యూస్ గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లోని కెరోటినాయిడ్స్ కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కణజాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ధూమపానం ప్రతికూల దుష్ప్రభావాలను ఎదుర్కొంటుంది.

గర్భధారణ సమయంలో జ్యూస్ తీసుకోవడం మహిళలకు అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం ఎముకలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.