Site icon HashtagU Telugu

Weight Loss Drink: ఈ ఒక్క జ్యూస్ తో ఎంత లావు ఉన్నా సరే సన్నగా నాజూగ్గా మారాల్సిందే.. ఆ జ్యూస్ ఏంటంటే!

Weight Loss Drink

Weight Loss Drink

ఈ రోజుల్లో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. చాలా లావుగా ఉన్నామని చాలామంది తెగ బాధ పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అధిక బరువు సమస్య తగ్గించుకోవడానికి చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా బరువు తగ్గడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తీసుకుంటే ఈజీగా హెల్తీగా బరువు తగ్గడం ఖాయం అంటున్నారు. మరి అందుకోసం ఎలాంటి జ్యూస్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యారెట్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్ లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని శుభ్రం పరచడంతో పాటు, బరువును తగ్గిస్తాయట. క్యారెట్‌ లో ఫైబర్ మోతాదులో ఉండటం వల్ల ఇది జీర్ణ వ్యవస్థను ఉత్తమంగా పని చేసేలా చేస్తుందట. బీటా కేరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పదార్థాలు శక్తినిచ్చే తత్వాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ అధికంగా తినే అలవాటును నియంత్రించడంలో సహాయపడుతుందట. దీన్ని తాగిన తర్వాత ఆకలి తగ్గుతుందని, తద్వారా ఎక్కువగా తినకుండా ఉంటారని, ఫలితంగా శరీరంలో కాలరీలు తగ్గడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా క్యారెట్‌ లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుందట.

శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుందని చెబుతున్నారు. సహజ తీపి ఉన్నప్పటికీ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించగలదట. అందుకే మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని మితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. కాగా క్యారెట్‌లో ఉండే పోషకాల ప్రభావంతో చర్మానికి ఆరోగ్యకరమైన నిగారింపు వస్తుందట. ఇది శరీరంలో సహజమైన ప్రకాశాన్ని పెంచడానికి సహాయపడుతుందట. ఇకపోతే క్యారెట్ జ్యూస్ తయారు చేయడానికి ముందుగా రెండు నుంచి మూడు తాజా క్యారెట్లు తీసుకోని శుభ్రంగా కడిగి పై పొట్టు తీసేయాలి. ఆ తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. ఇప్పుడు కొంచెం నీరు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బట్టతో వడకట్టాలట. ఇందులో రుచి కోసం కొద్దిగా నిమ్మరసం లేదా కొద్దిగా అల్లం కూడా కలుపుకోవచ్చని చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శక్తివంతమైన ఫలితాలు లభిస్తాయట. దాంతో శరీరం టాక్సిన్లను బయటకు పంపి స్వచ్ఛతను కాపాడుతుందట. రోజూ ఇలా చేస్తే కొన్ని వారాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. క్యారెట్ ను కేవలం జ్యూస్ రూపంలో మాత్రమే కాకుండా ఎలా తీసుకున్నా కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి అని చెబుతున్నారు..