Pregnancy and Carrot: గర్భిణులు క్యారెట్ తింటే లోప‌ల బిడ్డ‌ న‌వ్వుతుందంటా..!

శాస్త్రవేత్తలు మ‌న‌కు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విష‌యాల‌ను, ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్తుంటారు. తాజాగా.. శాస్త్రవేత్తలు

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 10:10 AM IST

శాస్త్రవేత్తలు మ‌న‌కు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విష‌యాల‌ను, ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్తుంటారు. తాజాగా.. శాస్త్రవేత్తలు గర్భస్థ శిశువుల‌పై అధ్యయనం చేసి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. క‌డుపులో ఉన్న‌బిడ్డ గర్భిణి తీసుకోనే ప‌దార్థాల (ఆహారం) రుచిని బట్టి స్పందిస్తుంటాయని తెలిపారు. గర్భిణులు రుచికరమైన ఆహారం తింటే లోపల బిడ్డ న‌వ్వుతుందంటా.. రుచి లేని ఆహారాన్ని తీసుకుంటే ఏడుస్తుందంటా. యూకే లోని డర్హామ్ యూనివర్శిటీలోని ఫీటల్, నియోనాటల్ రీసెర్చ్ ల్యాబ్ నేతృత్వంలోని శాస్త్ర‌వేత్త‌లు ఈ అధ్యయనం చేశారు.

18-40 ఏళ్ల వయసున్న 100 మంది గర్భిణులకు శాస్త్ర‌వేత్త‌లు 4డీ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించారు. 32, 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు రెండుసార్లు స్కానింగ్‌ చేశారు. 100 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. స్కానింగ్‌కు ముందు మొదటి గ్రూప్‌లోని గర్భిణులకు క్యారెట్‌ను, రెండో గ్రూప్‌లోని వారికి క్యాబేజీని 400 ఎంజీ మాత్రల రూపంలో ఇచ్చారు. మూడో గ్రూప్‌లోని గర్భిణులకు ఏమీ ఇవ్వలేదు.

క్యారెట్‌ మాత్ర తీసుకున్న మహిళల గర్భంలోని శిశువుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. క్యాబేజీ మాత్ర తీసుకున్న వారి గర్భంలోని శిశువులు మాత్రం ఇష్టం లేదన్నట్లుగా ముఖం పెట్టారు. మాత్రలు తీసుకోనివారి గర్భంలోని శిశువుల్లో ఎలాంటి రియాక్ష‌న్‌ లేదు. ఈ అధ్యయనం వివరాలను సేజ్‌ జర్నల్‌లో ప్రచురించారు. గర్భిణి తీసుకొనే ఆహారం శిశువును ప్రభావితం చేస్తుందని వైద్యులు చెప్పుతుంటారు. గర్భంతో ఉన్న‌ప్పుడు గ‌ర్భిణి ఎలాంటి ఆహారం తీసుకుంటుందో.. శిశువు జ‌న్మించాక అలాంటి ఫుడే వారికి ఫెవ‌రేట్‌గా మారుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.