Site icon HashtagU Telugu

Cardamom: ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే యాలకులు తీసుకోవాల్సిందే?

Mixcollage 03 Feb 2024 11 44 Am 6835

Mixcollage 03 Feb 2024 11 44 Am 6835

మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో యాలకులు కూడా ఒకటి. వీటిని ఎన్నో రకాల ఆహార పదార్థాలలో తీపి పదార్థాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. యాలకులు తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. యాలకులు లేకుండా ఏ తీపి వంటకం కూడా చేయరు. ఇలా మన ఆహారంలో యాలకులు భాగం అయిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం మరొకసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలలో మళ్లీ కరోనా కేసులు మొదలవుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారితో మనం అంతా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. దీంతో ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. దాంతో శ్వాస అందకపోవడం, ఇతర సమస్యలు వచ్చి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. అయితే ఈ కరోనా సమయంలో వచ్చే లంగ్స్ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవాలంటే యాలకులు కచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే భవిష్యత్తులో ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా యాలకులను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిందే.

కొంతమంది యాలకులను నేరుగా కూడా తింటూ ఉంటారు. అలా తినడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా ఉండదు. చాలామందికి బాగా దగ్గు బాగా వస్తుంటుంది. ఊపిరితిత్తుల్లో నిమ్మ వస్తుంది. అలాగే ఒక్కోసారి ఊపిరి ఆడదు. ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. అటువంటి వాళ్లకు దివ్యౌషధం యాలకులు. అవును యాలకులు సుగంధ ద్రవ్యాలు అని అందరికీ తెలిసిందే. వాటిని ప్రతిరోజు ఏదో విధంగా తీసుకుంటే కఫం, దగ్గు, ఇన్ఫెక్షన్, శ్వాస అందకపోవడం లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆస్తమాను కూడా యాలకులతో నయం చేయవచ్చు. యాలకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ ఏర్పడదు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డిప్రెషన్ ను తగ్గిస్తుంది. అయితే యాలకులను రోజూ పరిమితంగానే తీసుకోవాలి. చాలామంది యాలకులను టీ ద్వారా తీసుకుంటారు. అలా టీ ద్వారా తీసుకుంటే రోజూ రెండు కప్పుల యాలకుల టీ తాగితే చాలు. లేదంటే కూరల్లో పోడిగా చేసుకొని వేస్తుంటారు.