Cardamom: యాలకుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ యాలకులను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాలకు

  • Written By:
  • Updated On - March 25, 2024 / 08:50 PM IST

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ యాలకులను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాలకులని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కేవలం రుచి పరంగానే మాత్రమే కాకుండా వాసన పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. యాలకులను తరచుగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్థాలు ఉన్నాయి.

నోటి దుర్వాసన లాంటి సాధారణ సమస్యలతో పాటు గుండె పోటు లాంటి అసాధారణ సమస్యలను నివారించడంలో యాలకులు కీలకపాత్ర వహిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలకులు తిని ఒక గ్లాసు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచుతుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా యాలకుల వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయి. డిప్రెషన్ నుంచి బయట పడాలంటే యాలకుల టీకానీ, పాలుకానీ తాగితే సరిపోతుంది. అలాగే ఇవి సంతాన సాఫల్యతను పెంచుతాయి. వీటిలో సినియోల్ అనే కాంపౌండ్ పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది.

ప్రతి రోజు చిటికెడు యాలకుల పొడి వాడినా కూడా సంతానం కలుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు, లైంగిక సామర్థ్యం లేనివారు ప్రతిరోజు యాలకులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో మంట, నొప్పి వంటివి ఉంటే ఇవి పోగొడతాయి. నెగెటివ్ ఆలోచనల నుంచి మనల్ని యాలకులు కాపాడతాయి. ప్రతిరోజు యాలకుల టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని వాడాలి. కఫాన్ని తగ్గిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ ను కూడా నయం చేస్తాయి. యాలకుల్లో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. ఈ దిశగా ఇంకా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. బ్లడ్ ప్రెజర్ ను ఎక్కువ, తక్కువ కాకుండా యాలకులు చూస్తాయి. క్యాన్సర్ వస్తే అది త్వరగా పెరగకుండా కాపాడతాయి. ఉద్రిక్తతలను కూడా తగ్గిస్తాయి. ఒత్తిడిలో ఉన్నవారు టీకానీ, పాలల్లోకానీ యాలకుల పొడి వేసుకొని తాగితే చాలా మంచిది.