Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులు తినవచ్చా…?

  • Written By:
  • Publish Date - November 21, 2022 / 10:30 AM IST

గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో మరచిపోలేని అనుభూతి. గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమంది గర్భదారణ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఇలాంటి విషయంలో గర్భిణీకి గందరగోళ పరిస్థితి ఎదురైతుంది. గర్బాదారణ సమయంలో వాటిని తినవచ్చా లేదా అనేది అంతుపట్టదు. వాటిలో ఒకటి పుట్టగొడుగులు.

పుట్టగొడుగుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. గర్భిణీకు సురక్షితమా లేదా అనేది తెలుసుకుందాం.

గర్భధారణలో పుట్టగొడుగు ప్రయోజనాలు
గర్భధారణ సమయంలో పుట్టగొడుగులను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కడుపులో పెరుగుతున్న బిడ్డకు బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ డి గర్భదారణ సమయంలో చాలా అవసరం ఉంటుంది. ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులలో ఉండే ఐరన్ గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు సహాయపడతాయి. ఇందులో జింక్, పొటాషియ, సెలీనియం పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి.

జాగ్రత్తలు తప్పనిసరి
అయితే పుట్టగొడుగులు తినే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఊదాహరణకు మార్కెట్లో దొరికే అనేక రకాల పుట్టగొడుగులు గర్భిణీలకు మంచివి కావు. కొన్ని మాత్రమే తీసుకోవాలి. అందులో పారసోల్ మష్రూమ్, ఫాల్స్ మోరల్ మష్రూమ్స్ వీటిని తీసుకోకూడదు.

1. గర్భధారణ సమయంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.
2. మీరు పుట్టగొడుగులను తినవచ్చు. కానీ అది పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.
3. పుట్టగొడుగులను పచ్చిగా తినకూడదు. బాగా కడిగి ఉడికిన తర్వాతే తినాలి.
4. తాజా పుట్టగొడుగులను కొనండి. వాటిపై మరక లేదా పురుగులు లేవని నిర్ధారించుకోండి.
5. మీరు ఎప్పుడు తినేముందు ఒకసారి వైద్యుడి సలహా తీసుకోండి. ఎందుకంటే కొంతమంది మహిళలు పుట్టగొడుగులను తీసుకోవడం ద్వారా సమస్యలను ఎదుర్కొంటారు.
6. పుట్టగొడుగులను తిన్న తర్వాత మీకు కడుపు నొప్పి, వాంతులు లేదా మరేదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని తినకూడదు.