Site icon HashtagU Telugu

Pregnant Women: గర్భిణీ స్త్రీలు వంకాయలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 23 Jul 2024 12 40 Pm 812

Mixcollage 23 Jul 2024 12 40 Pm 812

మామూలుగా గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో అనేక రకాల జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని ఏది పడితే అది తినకూడదని చెబుతూ ఉంటారు. అలాగే ఏదైనా ఆహార పదార్థాలు తినేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. లేదంటే కడుపులోని బిడ్డకు అలాగే తల్లికి ఇద్దరికీ ప్రమాదం కలగవచ్చని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు. ఆకుకూరలు, తృణధాన్యాలు, కూరగాయలు పండ్లు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే మన వంటింట్లో దొరికే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి.

చాలామంది స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వంకాయ తినవచ్చా తినకూడదా అని సందేహపడుతూ ఉంటారు. కొందరు వంకాయ తింటే నవ్వలు వస్తాయని, కాళ్లు చేతులు దురదగా అనిపిస్తుందని అంటూ ఉంటారు. మరి నిజంగానే ప్రెగ్నెంట్ స్త్రీలు వంకాయ తినకూడదా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు వంకాయ తినకూడదు అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని చెబుతున్నారు. ఎందుకంటె వంకాయలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వంకాయలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భాశయంలో పెరుగుతున్న బిడ్డ మెదడు అభివృద్ధికి సహాయపడుతుందట.

అలాగే న్యూరల్ ట్యూబ్ లోపాలను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. వంకాయలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్లను నిర్వహించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రక్తపోటును ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుందట. వంకాయలో విటమిన్ కె తల్లి బిడ్డ ఎముకలను బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. వంకాయలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడే డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎక్కువగా వచ్చే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. అలాగే వంకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది గర్భిణీలు మరీ బరువు పెరగకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వంకాయలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే ఎన్నో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. వంకాయలో ఉడే రిబోఫ్లేవిన్ , బయో ఫ్లేవనాయిడ్స్ రక్తపోటును తగ్గిస్తాయట. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. మరి వంకాయను ఎలా తినాలి అన్న విషయానికొస్తే.. వంకాయను తినాలి అనుకున్న వారు వాటిని బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. అలాగే మితంగా మాత్రమే తీసుకోవాలి. తిన్న తర్వాత ఎవరికైనా గొంతులో మంట అలాగే దురద వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.