Site icon HashtagU Telugu

Brinjal: గర్భిణీ స్త్రీలు వంకాయ తినవచ్చా, తినకూడదా? తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Brinjal

Brinjal

మామూలుగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పాటించాలని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతూ ఉంటారు. తీసుకునే ఆహార విషయంలో సరైన శ్రద్ధ పాటించకపోతే తల్లి ఆరోగ్యానికి బిడ్డ ఆరోగ్యానికి అది హాని కలిగిస్తుందని చెబుతుంటారు. అందుకే తల్లి బిడ్డ ఆరోగ్యం గా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అయితే చాలామంది గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలు వంకాయ తినడానికి భయపడుతూ ఉంటారు. వంకాయలు తింటే దురదగా ఉంటుందని స్కిన్ ఎలర్జీ వస్తుందని అంటూ ఉంటారు.

మరి ఇంతకీ గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలు వంకాయ తినవచ్చా? తినకూడదా వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు వంకాయ తినకూడదు అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని చెబుతున్నారు. వంకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయట. వంకాయలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుందట. ఇది గర్భాశయంలో పెరుగుతున్న బిడ్డ మెదడు అభివృద్ధికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే న్యూరల్ ట్యూబ్ లోపాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందట. కాగా వంకాయలో పొటాషియం కూడా మెండుగా ఉంటుందట. ఇది ఎలక్ట్రోలైట్లను నిర్వహించడానికి సహాయపడుతుందట. అలాగే రక్తపోటు ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా సహాయపడుతుందట.

అంతేకాదు వంకాయలో విటమిన్ కె కూడా ఉంటుందట. ఇది తల్లీ, బిడ్డ ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుందని, ఇది రక్తం గడ్డకట్టడానికి కూడా అవసరం అని చెబుతున్నారు. వంకాయలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడే డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందట. గర్భధారణ సమయంలో ఎక్కువగా వచ్చే మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే వంకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయట,ఇది గర్భిణీలు మరీ బరువు పెరగకుండా కాపాడుతుందని చెబుతున్నారు. వంకాయలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే ఎన్నో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. వంకాయలో ఉడే రిబోఫ్లేవిన్ ,బయోఫ్లవనాయిడ్స్ రక్తపోటును తగ్గిస్తాయట. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు.