Chicken: రోజూ చికెన్ తినొచ్చా? తినకూడదా? నిపుణులు ఏమంటున్నారు?

ప్రతిరోజూ చికెన్ తినొచ్చా? రోజూ చికెన్ తింటే ఏమవుతుంది? వీటిపై డైటీషియన్స్ ఏమంటున్నారు?

చాలామందికి ఫెవరేట్ ఫుడ్ చికెన్ (Chicken). ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సెలీనియం, ఫాస్పరస్ , నియాసిన్ (విటమిన్ B3) వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అయితే కోడిలోని ఒక్కో పార్ట్ లో ఒక్కో విధమైన పోషకాల ప్రొఫైల్ ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ , చికెన్ తొడల భాగంలో ఉండే పోషకాల వివరాలను ఒకసారి మనం పోల్చి చూద్దాం..

స్కిన్‌లెస్ చికెన్ బ్రెస్ట్ (Chicken Brest) (85 గ్రాముల) లో పోషకాలు ఇవీ..

  • కేలరీలు: 128
  • ప్రోటీన్: 26 గ్రా
  • మొత్తం కొవ్వు: 3 గ్రా
  • సంతృప్త కొవ్వు: 1 గ్రా
  • కార్బోహైడ్రేట్లు: 0 గ్రా
  • సెలీనియం: 24 మైక్రో గ్రామ్స్
  • పొటాషియం: 332 మిల్లీ గ్రామ్స్
  • జింక్: 1 మిల్లీ గ్రామ్స్ లోపు
  • విటమిన్ B3: 10 మిల్లీ గ్రామ్స్
  • సోడియం: 44 మిల్లీ గ్రామ్స్
  • ఇనుము: 1 మిల్లీ గ్రామ్ లోపు

స్కిన్‌లెస్ చికెన్ తొడల (Chicken Thighs) (85 గ్రాముల) లో పోషకాలు ఇవీ..

  • కేలరీలు: 164
  • ప్రోటీన్: 20 గ్రా
  • మొత్తం కొవ్వు: 9 గ్రా
  • సంతృప్త కొవ్వు: 2.4 గ్రా
  • కార్బోహైడ్రేట్లు: 0 గ్రా
  • సెలీనియం: 20 మైక్రో గ్రామ్స్
  • పొటాషియం: 223 మిల్లీ గ్రామ్
  • జింక్: 2 మిల్లీ గ్రామ్
  • విటమిన్ B3: 5 మిల్లీ గ్రామ్
  • సోడియం: 285 మి.గ్రా
  • ఇనుము: 1 మిల్లీ గ్రామ్ లోపు

శరీరం ఉత్పత్తి చేయలేని 9 అమైనో యాసిడ్స్ చికెన్ (Chicken) లో..

ప్రోటీన్లు మన శరీరంలో హార్మోన్లు , రోగనిరోధక కణాల ఉత్పత్తి , కండరాల పెరుగుదలను ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరాన్ని సరిచేయడానికి , కండరాల వంటి కొత్త కణాలను నిర్మించడంలో  సహాయపడే ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్ ప్రోటీన్. ప్రోటీన్ లో 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి.మన శరీరం సహజంగానే వీటిలో 11 అమైనో ఆమ్లాలు ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన 9 అమైనో ఆమ్లాలు మన బాడీకి అందాలంటే.. చికెన్ (Chicken) వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి.మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాల సంపూర్ణ సమతుల్యతను చికెన్ కలిగి ఉంటుంది.

శరీరానికి ప్రోటీన్స్ ప్లాన్:

70 కిలోల బరువున్న వ్యక్తికి రోజూ 56 గ్రాముల ప్రోటీన్ అవసరమని డైటీషియన్స్ అంటున్నారు. అయితే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుందని చెబుతున్నారు. ప్రతి భోజనంలో తప్పనిసరిగా 15 నుంచి 30 గ్రాముల ప్రోటీన్‌ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లక్ష్యాలను చేరుకోవడానికి చికెన్ గొప్ప మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు.

రోజూ చికెన్ తింటే.. ఇవి చూసుకోండి:

  1. చికెన్లో ప్రోటీన్స్ బాగా ఉన్నప్పటికీ ఎక్కువగా దానిపై ఆధార పడకూడదు.
  2. విభిన్న రకాల ఫుడ్స్ నుంచి మీ శరీరానికి ప్రోటీన్ అందేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి.
  3. ప్రోటీన్స్ కోసం కేవలం చికెన్ పైనే ఆధారపడితే.. రోజూ చికెన్ తింటే మీరు ఒమేగా-3 వంటి ముఖ్యమైన కొవ్వులతో సహా కొన్ని కీలక పోషకాలను కోల్పోతారు.
  4. ఉదాహరణకు స్కిన్‌లెస్ చికెన్ బ్రెస్ట్‌లో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి దానిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మీ బాడీకి అవసరమైన ఇతర కొవ్వులు లభించవు.
  5. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే రొయ్యలు, పెరుగు, గుడ్లు, పప్పులు, బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు తినొచ్చు. ఇవి ప్రోటీన్ తో పాటు ఫైబర్, పొటాషియం, ఐరన్ కూడా బాడీకి అందిస్తాయి.

Also Read:  Delivery Agent: ఐఫోన్ కి డబ్బులు లేవని డెలివరీ ఏజెంట్ ని చంపేసిన ఓ వ్యక్తి