వేసవికాలంలో దొరికే పండ్లలో మామిడి పండు కూడా ఒకటి. ఈ మామిడిపండు కేవలం వేసవికాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. అందుకే వీటి కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. అయితే చాలామందికి మామిడి పండు తిన్న తరువాత నీరు తాగే అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు తాగితే మరికొన్నిసార్లు అనుకోకుండా దాహం వేస్తూ ఉంటుంది. అసలు ఇంతకీ మామిడి పండు తిన్న తర్వాత నీళ్లు తాగవచ్చా తాగకూడదా, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వచ్చేస్తాయి. విటమిన్ ఎ తో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలు, డార్క్ స్పాట్స్ సమస్యల్ని పోగొడతాయి. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టే మామిడిని పండ్లకు రారాజు అని పిలుస్తారు. వీటిలో ఎన్నో రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఆయా రకాన్ని బట్టి ధర ఉంటుంది. వేసవిలో రోజు ఒక మామిడి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. వీటిలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్నీ కాపాడుతుందట. అయితే వీటిలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే పరిమితంగా వీటిని తినాలని చెబుతున్నారు.
మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే మామిడి ప్రతి వేసవిలో అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు మూడు నెలల పాటు వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే మామిడి పండ్లు తినే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదట. నీళ్లు తాగడం వల్ల పొట్టలోని యాసిడ్స్ డైల్యూట్ అయిపోయి అజీర్తికి దారి తీసే ప్రమాదం ఉందట. మామిడి పండు తిన్న తర్వాత ఒక అరగంట తరవాతే నీళ్లు తాగాలని చెబుతున్నారు..
మామిడి పండ్లు తినడం మంచిదే. అయితే ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదట. సాధారణంగా మామిడి పండ్లు తిన్నాక కాసేపటికే దాహం వేస్తుంది. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉందట. మామిడ పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందట. ఈ షుగర్ శరీరంలోని నీటిని పీల్చేస్తుందట. ఆ చక్కెర కరిగేంత వరకూ అలా నీటిని గ్రహిస్తుంది. ఫలితంగానే బాడీ డీహైడ్రేషన్ కి గురవుతుందట. అందుకే వెంటనే దాహం వేస్తుంది. కొన్ని సార్లు మామిడి పండ్లు తిన్నప్పుడు నాలుకపై అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇచింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. వెంటనే నీళ్లు తాగాలి అనిపించడానికి మరో కారణం అని చెబుతున్నారు. అయితే మామిడి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఇబ్బందులు ఎదురవుతాయట.