Site icon HashtagU Telugu

Back Pain: వెన్నునొప్పి తట్టుకోలేకపోతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Back Pain

Back Pain

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా చాలామంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వెన్ను నొప్పి సమస్యకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఈ వెన్ను నొప్పి నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వెన్ను నొప్పి కారణంగా కూర్చోవడానికి నడవడానికి కొన్నిసార్లు పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి సింపుల్ గానే వెన్ను నొప్పి సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీపు ఎముకలు, కండరాలు, స్నాయువుల సమస్యల వల్ల కూడా వెన్ను నొప్పి సమస్య వస్తుందట. అలాగే కడుపును ఏదైనా సమస్య ఉంటే కూడా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుందని చెబుతున్నారు. ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో కూర్చుని డ్రైవింగ్ చేయడం ప్రయాణించడం లాంటివి చేయడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుందట. పోషకాహార లోపం, స్థూలకాయం కూడా వెన్నునొప్పికి దారితీస్తాయట. ముఖ్యంగా కంప్యూటర్ ముందు గంటలకు గంటలు కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుందట. ఇది నొప్పిని కలిగిస్తుందట.

ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అలాగే వెన్నుపామును బలోపేతం చేయడానికి యోగా, వ్యాయామాలు కూడా చేయాలని చెబుతున్నారు. వెన్నునొప్పి తగ్గాలంటే మాత్రం సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే వెన్ను నొప్పి చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. కొద్దిదూరం నడిచినా కూడా బాగా అలసిపోతారు. అలాగే వీపు కింది భాగంలో కత్తి పోట్లకు గురవుతారట. ఈ తేలికపాటి నొప్పి, కండరాల తిమ్మిరి, వంగి ఏదైనా తీసుకున్నప్పుడు విపరీతమైన నొప్పి కలగడం వెన్నునొప్పి వంటివి లక్షణాలుగా కనిపిస్తాయి.