Site icon HashtagU Telugu

Belly Fat: వాకింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ కరుగుతుందా.. ఇందులో నిజమెంత?

Mixcollage 20 Jul 2024 10 46 Am 8602

Mixcollage 20 Jul 2024 10 46 Am 8602

ప్రస్తుత రోజుల్లో ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోయి చాలా లావుగా కనిపిస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. విపరీతమైన బరువు పెరిగిన వారు కూడా ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ మంది చేసే ప్రయత్నాలలో వాకింగ్ కూడా ఒకటి. ఉదయం సాయంత్రం వీలు కుదిరినప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు. మరి నిజంగానే వాకింగ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరుగుతుందా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాకింగ్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నడవడం వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాకింగ్ అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే క్యాలరీలు బర్న్ చేయడంతో పాటు మెటబాలిజం మెరుగవుతుంది. అయితే ప్రతిరోజు వాకింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ కలుగుతుందా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. మరి ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఊబకాయం ఉన్న వారు వారానికి కనీసం మూడు సార్లు 12 వారాల పాటు 50 నుండి 70 నిమిషాలు నడవాలట. ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ తో పాటు బాడీలో ఇతర ఫ్యాట్ కూడా కోల్పోవచ్చని చెబుతున్నారు.

అలాగే ప్రతిరోజూ కేవలం 30 నిమిషాల సాధారణ నడక బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుందట. అయినప్పటికీ మీ ప్రస్తుత బరువు, శరీర కూర్పు, మొత్తం ఆహారం, జీవనశైలి వంటి అనేక అంశాలపై ఆధారపడి బెల్లీ ఫ్యాట్ కరగడం అనేది ఆధారపడి ఉంటుందట. వాకింగ్ చేయడంతో పాటు అందుకు తగ్గ ఆహారం కూడా తీసుకోవాలని చెబుతున్నారు. వాకింగ్ చేయడం మొదలుపెట్టగానే బెల్లీ ఫ్యాట్ కరగదట. ముందుగా బరువు తగ్గి, శరీరంలోని ఇతర ప్రాంతాల్లో ఫ్యాట్ కరిగిన తర్వాత దాని ప్రభావం బెల్లీ ఫ్యాట్ మీద చూపిస్తుందట.

కేవలం ఒక్క వాకింగ్ మాత్రమే కాకుండా ఇంకా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల, లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్ లేదా డ్యాన్స్ ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండటం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ కరిగి, అధిక బరువు కూడా తగ్గవచ్చు అని చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలి అంటే ఆహారంలో కొన్ని రకాల మార్పులు తప్పకుండా చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

Exit mobile version