Site icon HashtagU Telugu

Thyroid: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇవి తినాల్సిందే?

Thyroid

Thyroid

థైరాయిడ్ అనేది ఒక గ్రంధి. ఇది శరీరం ఎదుగుదలకు ఎంతో సహాయ పడటంతో పాటు జీవక్రియలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ థైరాయిడ్ సీతాకోకచిలుక ఆకారంలో ఉండి మెడ ముందు భాగంలో ఉంటుంది. అయితే ఈ థైరాయిడ్ గ్రంధిలో ఎటువంటి మార్పులు రానంతవరకు ఎటువంటి సమస్యలు ఉండవు కానీ ఒకవేళ ఈ థైరాయిడ్ గ్రంధి పనితీరులో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే శరీరంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. మరి ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు అలసట సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

థైరాయిడ్ గ్రంధి హార్మోన్ల శక్తి స్థాయి, జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత, మానసిక స్థితి, గుండె స్పందన రేటు, రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్య కారణంగా చాలామంది ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. మరి థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉసిరికాయ థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరిలో నారింజ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ విటమిన్ సి దానిమ్మ పండ్లు కంటే 17 రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంతో పాటు థైరాయిడ్ పనితీరు మెరుగుపరచడంలో కూడా సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు.

అలాగే పెసలు.. ఇందులో పీచు, అయోడిన్ ,జింక్ సమృద్ధిగా ఉంటుంది. మూడవది గుమ్మడి గింజలు.. రోజుకు ఒక ఔన్స్ ఎండిన గుమ్మడికాయ గింజలు తింటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ కోసం రోజువారీగా శరీర అవసరాలను తీరుస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే రక్తపోటు, ఉబకాయం నుంచి రిలీఫ్ పొందవచ్చు. నాలుగవది పెరుగు.. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. గ్రంధి పనితీరును మెరుగుపరిచి అయోడిన్ అవసరాలను తీరుస్తుంది. కొబ్బరి.. ఇందులోని చైన్ ఫ్యాటీ యాసిడ్స్ సమతుల్య జీవక్రియను నిర్ధారిస్తాయి.