Pine Apple: గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 06:30 PM IST

స్త్రీలకు తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అందుకే స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కడుపులో ఉండే బిడ్డ విషయంలో తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు చేసే ప్రతి ఒక్క పని కూడా తనపై తన కడపలో శిశువుపై ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యంపైనే గర్భంలోని శిశువు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తల్లులు కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవా ల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో కూడా చాలా ముఖ్యం. చాలామంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.

ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అన్న విషయాలు తెలియక తికమక పడుతూ ఉంటారు. అటువంటి వాటిలో పైనాపిల్ కూడా ఒకటి. గర్భిణీ మహిళలు పైనాపిల్‌ను ఆహారంగా తీసుకోవచ్చు. పైనాపిల్ ఒక రుచికరమైన, పోషకమైన పండు. ఇది గర్భధారణ సమయంలో చాలా ప్రయోజనాలను అందిస్తుంది. పైనాపిల్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఫోలేట్‌కు కూడా మంచి మూలం, ఇది గర్భధారణ సమయంలో ముఖ్యమైన పోషకం. ఫోలేట్ శిశువు మెదడు వెన్నెముక అభివృద్ధిలో సహాయపడుతుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని పలు అవయవాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది గర్భధారణ సమయంలో సాధారణంగా కనిపించే మలబద్ధకం మరియు ఉబ్బసంల నుంచి ఉపశమనం కల్పించడంలో తోడ్పడుతుంది. అందుకే వైద్యులు పైనాపిల్‌ తీసుకోవాల్సిందిగా గర్భిణీ స్త్రీలకు సూచిస్తారు. అయితే కొందరు గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందని లేదా పిండం వృద్ధి చెందడంలో జాప్యం ఏర్పడుతుందని ఆందోళన చెందుతారు. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. అయితే గర్భస్రావం, పిండం వృద్ధి చెందకపోవడానికి పైనాపిల్ కారణం కాదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. పైనాపిల్ తినాలనుకునే గర్భిణీ స్త్రీలు ఇంకా ఏమైనా అనుమానాలుంటే వైద్యుడిని సంప్రదించి వారి సలహా తీసుకుంటే మంచిది. అలాగే పైనాపిల్ పూర్తిగా పండిందని నిర్థారించుకోవాలి. పండని పైనాపిల్‌లో బ్రోమెలైన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది గర్భస్రావం లేదా పిండం యొక్క వృద్ధిలో జాప్యానికి కారణం కావచ్చు. పైనాపిల్‌ను చాలా ఎక్కువగా తీసుకోవద్దు. గర్భధారణ సమయంలో, మీరు రోజుకు ఒక కప్పు పైనాపిల్‌కు మించి తినకూడదు. పైనాపిల్‌ను తినే ముందు, దానిని శుభ్రం చేసి, గింజలను తీసివేయాలి.