మామూలుగా స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలని చెబుతూ ఉంటారు. తీసుకునే ఆహారం విషయంలో చేసే పనుల విషయంలో ఇలా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ వహించాలని చెబుతూ ఉంటారు. అయితే ఆహార పదార్థాల విషయంలో చాలామంది మహిళలకు అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి.. అటువంటి వాటిలో పైనాపిల్ తినవచ్చా, తినకూడదా అన్న సందేహం ఒకటి.. చాలామందికి ఈ సందేహం కలిగి ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు పైనాపిల్ ని తినవచ్చో, తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీ మహిళలు పైనాపిల్‌ను ఆహారంగా తీసుకోవచ్చట.
పైనాపిల్ ఒక రుచికరమైన, పోషకమైన పండు, ఇది గర్భధారణ సమయంలో చాలా ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. కాగా పైనాపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఫోలేట్‌కు కూడా మంచి మూలం, ఇది గర్భధారణ సమయంలో ముఖ్యమైన పోషకం. ఫోలేట్ శిశువు మెదడు వెన్నెముక అభివృద్ధిలో సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని పలు అవయవాల వాపును తగ్గించడంలో సహాయపడుతుందట.
మాములుగా గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే వాపులను తగ్గిస్తుందట. అలాగే మలబద్ధకం, ఉబ్బసం లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుందట. అందుకే వైద్యులు పైనాపిల్ తీసుకోవాల్సిందిగా గర్భిణీ స్త్రీలకు సూచిస్తారు. అయితే కొందరు గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందని లేదా పిండం వృద్ధి చెందడంలో జాప్యం ఏర్పడుతుందని ఆందోళన చెందుతారు. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. అయితే గర్భస్రావం, పిండం వృద్ధి చెందకపోవడానికి పైనాపిల్ కారణం కాదని వారు చెబుతున్నారు.
అయితే ఒకవేళ పైనాపిల్ తినాలి అనుకున్న పూర్తిగా పండిందా లేదా పచ్చిగా ఉందా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పండని పైనాపిల్‌లో బ్రోమెలైన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది గర్భస్రావం లేదా పిండం వృద్ధిలో జాప్యానికి కారణం కావచ్చు. పైనాపిల్ ను ఎక్కువగా తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో, మీరు రోజుకు ఒక కప్పు పైనాపిల్ కు మించి తినకూడదట. పైనాపిల్‌ను తినే ముందు, దానిని శుభ్రం చేసి, గింజలను తీసిసీ తినాలట.
note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.