Site icon HashtagU Telugu

Mango Pickle: మామిడి ఊరగాయ తింటే బీపీ పెరుగుతోందా.. అయితే ఎలా తీసుకోవాలో తెలుసా?

Mango Pickle

Mango Pickle

మామిడి ఊరగాయ.. ఈ పేరు విన్నా, ఈ పచ్చళ్ళను చూసినా నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. చూడడానికి కలర్ ఫుల్ గా ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే ఈ పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలువ ఉండడం కోసం ఉప్పు కారం చాలా వేస్తూ ఉంటారు. ఉప్పు,కారం బీపీ పేషెంట్లకు శత్రువులు అని చెప్పాలి. బీపీ ఉన్నవాళ్లు ఈ పచ్చళ్లను ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. మరి బీపీ పేషెంట్లు పచ్చళ్ళను డైరెక్ట్ గా తింటే బీపీ పెరిగిపోతుంది అనుకుంటే మరి ఈ పచ్చళ్ళను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చళ్లలో ఎన్నో రకాల పచ్చళ్ళు ఉన్నాయి. అందులో మామిడి కాయ పచ్చడి కూడా ఒకటి. ఇందులో కారం, నూనె ఎక్కువగా ఉంటాయి.

ఎక్కువ రోజుల పాటు పచ్చడి నిల్వ ఉండాలంటే ఆ మాత్రం కారం, ఉప్పు పడాల్సిందే. అయితే మామూలు వాళ్లు తింటే పర్లేదు కానీ బీపీ పేషెంట్స్ ఈ పచ్చళ్లకు కాస్త దూరంగా ఉండాల్సిందే. కాగా సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిజానికి మన శరీరంలో ఫ్యూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి సోడియం అవసరమే. కానీ ఇది మితిమీరితే మాత్రం ప్రమాదకరం అని చెప్పాలి. సోడియం పెరిగే కొద్దీ శరీరంలో ఉన్న నీరంతా తగ్గిపోతూ ఉంటుందట. ఇది రక్తనాళాలపై ఒత్తిడి పెంచుతుందని చెబుతున్నారు. మాములుగా మామిడి కాయ పచ్చడిలో ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు ఎక్కువగా వేయకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇది తింటే సోడియం అధికంగా శరీరంలోకి వెళ్తుందట. 100 గ్రాముల పచ్చడిలో దాదాపు 2.5 గ్రాముల సోడియం ఉంటుంది.

ఈ స్థాయిలో సోడియం శరీరంలోకి వెళ్తే బీపీ పెరిగే ప్రమాదం కలుగుతుందని చెబుతున్నారు. అందుకే బీపీ పేషెంట్లు పచ్చళ్ళు తినాలి అనుకున్న కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు కానీ ప్రతిరోజు తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. సోడియం అధికంగా ఉండే మామిడి కాయ పచ్చడి తింటే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయట. ముందుగా ఈ పచ్చడిలో ఉన్న సోడియంని పేగులు అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ కారణంగా బాడీలో సోడియం లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయని చెబుతున్నారు. ఇది కరిగేందుకు నేరుగా రక్తనాళాల్లోకి చేరుకుంటాయి. ఫలితంగా వాటిపై ఒత్తిడి పడుతుందట. ఆ సమయంలోనే బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందట. బాడీలో సోడియం కన్నా పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రోలైట్స్ అన్నీ బ్యాలెన్స్డ్ గా ఉంటాయట.ఈ రేషియోలో తేడా వస్తే వెంటనే బీపీ పెరుగుతుందని చెబుతున్నారు.

అందుకే బీపీ ఉన్న వాళ్లు సోడియం అధికంగా ఉండే ఆహారాలు తగ్గించి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుందట. ​బీపీ ఉన్న వాళ్లు మామిడికాయ పచ్చడిని పూర్తిగా దూరం పెట్టాల్సిన పని లేదట. కానీ కాస్తంత తక్కువగా తినడం మంచిది అని చెబుతున్నారు. అయితే పచ్చడి తిన్నప్పుడు అందులోని సోడియంని బ్యాలెన్స్ చేసే విధంగా మరి కొన్ని పదార్థాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదట. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ అధికంగా ఉండే ఫుడ్ తప్పనసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. మామిడి కాయ పచ్చడిలో మరీ అతిగా ఉప్పు వాడకుండా దానికి బదులుగా వేరే పదార్థాలు వాడితే మంచిది. ఈ పచ్చడిని బీపీ పేషెంట్స్ రెగ్యులర్ గా తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఉప్పు బదులుగా వెనిగర్, నిమ్మరసం, పసుపు, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, మెంతులు లాంటి వాటితో పచ్చడి తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సోడియం లెవెల్స్ చాలా వరకూ తగ్గిపోతాయట. బీపీ పెరిగే అవకాశం కూడా ఉండదట.