Blood Pressure: ప్రస్తుత రోజుల్లో చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే బీపీ సమస్య ఉన్నవారు అల్లం తాగవచ్చా? తాగకూడదా? ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చలికాలంలో వచ్చే దగ్గు, జులుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందట.
ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
దీంతో వీరు అల్లం టీ తాగే విషయంలో కాస్త గందరగోళానికి గురి అవుతుంటారు. దానిలో అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. అల్లం టీ తాగని వారితో పోలీస్తే ,అల్లం టీ తాగేవారిలో అధిక రక్తపోటు దాదాపు 8.4% తగ్గినట్లు వారు తెలిపారు. అందువలన అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు అల్లం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదట. కానీ దీనిని అతిగా తీసుకోకూడదని చెబుతున్నారు. అయితే అల్లం టీ ప్రత్యేకంగా తాగాల్సిన పని లేదు, అల్లాన్ని కొద్ది మొత్తంలో ఏ రూపంలో తీసుకున్నా అది శరీరానికి మేలు చేస్తుందట.
కాగా అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో వ్యాధి నిరోధక సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా అల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, రక్తాన్ని పలచబరుస్తుందట. అందువలన అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, కానీ దీనిని ఎక్కువ మొత్తంలో కాకుండా, తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు. కాగా అల్లం తీసుకోవడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తీసుకోవడం అసలు మంచిది కాదట.
Blood Pressure: బీపీ సమస్య ఉన్నవారు అల్లం టీ తాగవచ్చా.. తాగకూడదా?

Blood Pressure