Site icon HashtagU Telugu

Raisins Tips : డయాబెటిస్ ఉన్నవారు ఎండుద్రాక్ష తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Raisin Health Benefits

Raisin Health Benefits

Benefits of eating Raisins : ఈ రోజుల్లో ప్రతి పదిమందిలో 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిని అదుపులో ఉంచుకోవడానికి మార్కెట్ లోకి ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే ఈ డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో ఎండుద్రాక్ష (Raisins) కూడా ఒకటి. సాధారణంగా ఈ ఎండుద్రాక్ష తినడానికి కాస్త తీయగా ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

దాంతో ఈ ద్రాక్షను (Raisins) తినవచ్చా లేదా అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. మరి ఈ విషయం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండు ద్రాక్షలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో ఎండుద్రాక్షను (Raisins) తీసుకోవచ్చు. కానీ వాటిని అధికంగా తీసుకోకుండా మితంగా మాత్రమే తీసుకోవాలి. అన్ని పండ్ల లాగే ఎండు ద్రాక్షలో సహజ చెక్కర్లు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కావున దీనిని సమతుల్య ఆహారంలో యాడ్ చేసుకోవచ్చు.. ఎండు ద్రాక్షలో బోరాన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కణజాలలో ఒకటి బోరాన్ ఎముకలను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ బోరాన్ అద్భుతంగా పనిచేస్తుంది.

ఎండు ద్రాక్షలో ఆంటీ ఆక్సిడెంట్లు ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎండు ద్రాక్ష తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సహజ చెక్కర్లు కాకుండా ఎండు ద్రాక్ష లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఇది మంచి ఆహారం కాబట్టి మంచి గ్లైసోమిక్ నియంత్రణ నిర్వహించడానికి మితంగా తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఇది శరీరం అంతట ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.

అలాగే క్యాల్షియం, పొటాషియం మరియు బోరాన్ లాంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఎండుద్రాక్షలు కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టను శుభ్రంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా రక్తంలో చక్కెర లెవెల్స్ ని నియంత్రణ ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్షాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది అధిక బరువుని తగ్గించడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. అధిక ఫైబర్ ఆహారం తీసుకునే వారు బరువు తగ్గుతారు. ఆహారంలో ఎక్కువ ఫైబర్ జోడించడానికి ఎండు ద్రాక్ష అనుకూలమైనది.

Also Read:  Phonepe: ఫోన్ పే ఉపయోగిస్తున్నారా.. అయితే ఇకపై ఆ సర్వీసులు ఫ్రీగా పొందండిలా?