బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. ఇవి ఈ మధ్య కాలంలో మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభిస్తున్నాయి. అయితే కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా వాటి గింజలు ఆకులు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి ముఖ్యంగా కొద్దిగా సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వాటిలో ప్లేట్లెట్ల పెరుగుదల కూడా ఒకటి. చాలామందికి రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు వైద్యులు బొప్పాయి ఆకుల రసాన్ని తాగమని చెబుతూ ఉంటారు.
బొప్పాయి ఆకులలో కనిపించే పపైన్ చాలా మంచి ఔషధం. ఈ ఔషధం ప్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడుతుందట. అలాగే టాక్సిన్స్ ని తొలగించి చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లేట్ల స్థాయి పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు బొప్పాయి ఆకుల రసం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని ప్లేట్లెట్లను పెంచడానికి పని చేస్తుంది. ఈ ఆకుల రసంలో విటమిన్ ఏ,విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. ఇవి రక్తంలో పడిపోయిన ప్లేట్లెట్ల స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే బొప్పాయి ఆకుల రసం జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఎంజైమ్ లు వాపును తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో నీరు, పీచు ఎక్కువగా ఉంటుంది అందుకే మలబద్ధకాన్ని దూరం చేయటంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆకులో ఉండే ఫోలిక్ ఆసిడ్ శరీరంలోని చెడు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఆలాగే షుగర్ వ్యాధి తో బాధపడేవారు తరచూ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే బొప్పాయి ఆకుల కోసం మంచిదే కదా అని ఎక్కువగా మాత్రం తీసుకోకూడదట. ఈ ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకుంటే వాంతులు,విరోచనాలు, తలనొప్పి,తల తిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వ్యాధులు చెబుతున్నారు. కాబట్టి రక్తకణాల సంఖ్య తగ్గి బొప్పాయి రసం తీసుకోవాలి అనుకునే వారు వైద్యుల సలహా మేరకు ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.