Milk : పాలు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

పాలు.. జలుబు, అలసట, వాపు, టైప్ 2 మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందా? 

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 06:00 PM IST

పాలు.. జలుబు, అలసట, వాపు, టైప్ 2 మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందా?  సాధారణ ఆవు పాలలో A1, A2 అనే రెండు రకాల రెండు రకాల బీటా-కేసిన్ ఉంటుంది. ఈ రెండు రకాల పాలలో లాక్టోస్ (Lactose) మోతాదు ఒకేలా ఉన్నప్పటికీ.. A2 బీటా-కేసిన్ పాలు తీసుకున్న తర్వాత ప్రజల్లో తక్కువ గ్యాస్ట్రిక్ (Gastric) లక్షణాలను గమనించినట్లు వైద్య నిపుణులు తెలిపారు.అంటే A1 బీటా-కేసిన్ పాలు తీసుకున్న వారిలో ఎక్కువ
గ్యాస్ట్రిక్ లక్షణాలు బయటపడ్డాయన్న మాట.

ఆహారంపై ఇటీవల కాలంలో చర్చ పెరిగింది. ఏ ఫుడ్ తింటే ఎలాంటి లాభాలు ? ఎంతమేర నష్టాలు ? అనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వాటిలోనే ఒకటి పాలపై డిబేట్. పాలు అనారోగ్యానికి గురిచేస్తాయా అనే కోణంలో ఒక చర్చ నడుస్తోంది. దీనిపై ఒక వైద్య నిపుణుడి విశ్లేషణ ఇలా ఉంది.. “పెద్దయ్యాక మనందరికీ ఒక విషయం నేర్పించబడింది. పాలు మన ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మనకు బలమైన ఎముకలు , దంతాలు కావాలంటే పాలు తాగాలి. అయితే పాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు” అని చెప్పారు.

వైద్య నిపుణుడి ప్రకారం.. సాధారణ ఆవు పాలలో కనిపించే A1-beta-casein అనే ప్రోటీన్ కారణంగా పాలు కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది.ఈ ప్రొటీన్ జలుబు, సైనస్, అలసట, వాపు, టైప్ 2 మధుమేహం ,(Diabetis) ఆటిజం, (Autism) ఇతర నరాల సమస్యలకు దారితీసే ముప్పు ఉంటుంది. A2 పాలలో మ్యుటేషన్ కు (Mutation) గురైన A1-బీటా కేసైన్ ఉండదని అందువల్ల అది “ఆరోగ్యకరమైన పాలు” అని చెప్పారు.

మ్యుటేషన్ కు గురైన A1-బీటా కేసైన్ ఉన్న A1 రకం పాలు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయా? కొందరినే ప్రభావితం చేస్తాయా ? ప్రతి ఒక్కరినీ కొద్దిగా ప్రభావితం చేస్తుందా ? అనేది ఇప్పటికీ తెలియదని వైద్య నిపుణులు అంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో సెలెక్టివ్ బ్రీడింగ్ లేదా ఎ2 పాలను ఉత్పత్తి చేసే ఆవుల పెంపకం మాత్రమే ఏకైక మార్గమని అంటున్నారు.

“A1 బీటా-కేసిన్ పాలు తాగితే బీటా-కాసోమోర్ఫిన్-7 (BCM-7) అనే పెప్టైడ్ విడుదల అవుతుంది. ఇది గట్‌లో వాపును కలిగిస్తుంది. బాల్యంలో A1 పాలను తీసుకోవడం వల్ల టైప్ 1 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు నిర్ధారించారు. ఈ అధ్యయనాలు కేవలం పరిశీలనాత్మకమైనవి. వీటిని ఇప్పటికీ ఖచ్చితంగా నిర్ధారించలేదు” వైద్య నిపుణులు వివరించారు. బీటా-కేసిన్ A1 పాల వినియోగం టైప్-1 మధుమేహం, కరోనరీ హార్ట్ డిసీజ్, ఆర్టెరియోస్క్లెరోసిస్‌ ముప్పును కూడా కలిగించే ఛాన్స్ ఉంటుందని మరో వైద్య నిపుణుడు చెప్పారు.