Sesame Oil : నువ్వుల నూనె వంటకాలు మగవాళ్లు తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!!

నువ్వుల నూనె...దీపారాధనకు ఉపయోగిస్తుంటాం. వంటల్లో చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు. కానీ నువ్వుల నూనెతో వంట చేస్తే...ఆ వంటలు కాస్త డిఫరెంట్ టెస్ట్ గా ఉంటాయి.

  • Written By:
  • Updated On - July 7, 2022 / 10:24 AM IST

నువ్వుల నూనె.. దీపారాధనకు ఉపయోగిస్తుంటాం. వంటల్లో చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు. కానీ నువ్వుల నూనెతో వంట చేస్తే.. ఆ వంటలు కాస్త డిఫరెంట్ టెస్ట్ గా ఉంటాయి. ఇక తెలంగాణతోపాటు పలు ప్రాంతాల్లో నువ్వులు బాగా పండిస్తారు. వాటితోనే నూనెను పట్టిస్తుంటారు. కాగా నువ్వుల నూనె మగవారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలామంది నువ్వుల నూనె వాసన నచ్చక వంటల్లో వాడుకోరు. కానీ వంటలో ఈ నూనెను వాడితే కలిగే లాభాలు తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు.

మగవారు రోజుకు కనీసం ఒక స్పూను నువ్వుల నూనెను ఆహారంలో కలుపుకుని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. వారికి వీర్యకణాలు వృద్ధి చెందుతాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గితే సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. నువ్వుల నూనె వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి చాలా అవసర పడుతుంది. ఆడవారికి కూడా నువ్వుల నూనె ఎంతో మేలు చేస్తుంది. సమయానికి రుతుస్రావం వచ్చేలా చేయడంతోపాటు .. ఆ సమయంలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. చర్మవ్యాధులు, వాతం వంటివి రాకుండా అడ్డుకోవడంతోపాటుగా.. కంటిచూపును మెరుగుపరుస్తుంది.

స్త్రీల జుట్టును ఆరోగ్యంగా ఉంచి.. నిగనిగ మెరిసేలా చేస్తుంది. పిల్లలకు నువ్వుల నూనెతో వండి ఆహారాన్ని తినిపించడం వల్ల బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ నువ్వుల నూనెలో విటిమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి చిన్నారులకు నువ్వుల నూనెతో వండిన వంటలు తినడం చాలా ముఖ్యం. ఇందులోకాపర్, జింక్, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదం మందులు, కాస్మోటిక్స్ తయారీలలోవాడతారు. ఈ నూనెను తలకు పట్టించి మసాజ్ చేస్తే తలనొప్పి నయం అవుతుంది. తెల్లజుట్టు రావడం తగ్గుతుంది.

బాలింతలకు నువ్వుల నూనెతో వండిన వంటలు తినిపించడం చాలా ముఖ్యం. దీనివల్ల తల్లిపాల ద్వారా బలమైన పోషకాలు బిడ్డకు అందుతాయి. బిడ్డ మెడ త్వరగా నిలబడటమే కాకుండా.. ఎదుగుదల కూడా బాగుంటుంది. అందుకే ప్రసవించిన నాలుగు నెలలపాటు నువ్వుల నూనెతో వండిన వంటలే పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. ఇక ఈనూనెతో వండిన వంటలు వాసనతో ఉంటాయి. ఒక రెండు రోజుల తర్వాత అలవాటు అవుతుంది. నువ్వుల నూనె వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఓ సారి వాడి చూడండి.