ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కిడ్నీలో రాళ్ల సమస్య చాలా మందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా వస్తుంది. కిడ్నీలో రాళ్ల నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరంగా మారుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ప్రమాదం కానప్పటికీ, దానికి సరిగా ట్రీట్‌మెంట్ చేయకపోతే కొన్ని రకాల క్యాన్సర్ అభివృద్ధికి కారణమవుతాయట. అయితే కిడ్నీలో రాళ్లు వస్తే అది మూత్ర నాళాన్ని చికాకుపెడతాయట. ఈ చికాకు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందట. లేదంటే ఈ సమస్య పెరిగే అవకాశం ఉందట.
రాళ్ళ సమస్య ఉండి కొన్ని లక్షణాలు ఉంటే అప్పుడు అనుమానించాలి. ఎక్కువ రక్తపోటు, ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, కుటుంబంలో ఎవరికైనా మూత్రపిండ క్యాన్సర్ ఉండడం, రెగ్యులర్ గా రాళ్ళు, ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి. సాధారణంగా రాళ్లకి ట్రీట్‌మెంట్ గా దీనిని చేస్తారు. దీని వల్ల త్వరగా కోలుకుంటారు. మచ్చలు లేకుండా ఉంటాయి. రాళ్లని మొదట్లోనే గుర్తించాలి. హైడ్రేట్ గా ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలట. ఉప్పు, తీపి డ్రింక్స్, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారం తక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మకాయలు, ఉలవలు, కాకరకాయ, అరటిపండ్లు తీసుకోవాలి.
షుగర్, దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, అధికబరువు, అధిక రక్తపోటుని తగ్గించడం వల్ల రాళ్లు, క్యాన్సర్ వంటి ప్రమాదాలని తగ్గించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే త్వరగా యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. సమస్యని త్వరగా గుర్తించి సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే సమస్యని తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ సహా ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి, మూత్రపిండాల్లో రాళ్ల క్యాన్సర్‌కి కారణం కానప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలట.