Site icon HashtagU Telugu

Kalonji Oil : జుట్టు శాశ్వతంగా నల్లగా ఉండాలంటే కలోంజీ నూనెను ఇలా తయారు చేసుకొని వాడండి..!!

Kalonji Oil

Kalonji Oil

చాలా సంవత్సరాలుగా కలోంజీ లేదా ఉల్లి గింజలు వంటల్లో సుగంధ ద్రవ్యంగా మారుతున్నారు. కలోంజిలో యాంటిహిస్టామైన్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిన్న నల్ల గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం నుండి బరువు తగ్గించడం వరకు, ఇవి సహాయపడతాయి. కలోంజీని ఉల్లిపాయ గింజలు, నిగెల్లా విత్తనాలు అని కూడా అంటారు. ఇది హై బ్లడ్ షుగర్ ను సైతం బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఇది జుట్టుకు ముఖ్యమైన పోషకం అని మీకు తెలుసా! కలోంజీ ప్రయోజనాలు అంతం లేని పుస్తకం లాంటివి.

ప్రఖ్యాత డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్ లు సైతం జుట్టుకు కలోంజి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ముఖ్యంగా కలోంజి గింజలను కొబ్బరి నూనెలో నానబెట్టి రాత్రి పూట తలకు 21 రోజుల పాటు పట్టిస్తే, తెల్ల వెంట్రుకల గ్రోత్ ఆగిపోతుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అలాగే డాండ్రఫ్ కూడా పూర్తిగా నయం అవుతుందని చెబుతున్నారు. బట్టతల వస్తుందని భయపడే వారు సైతం బట్టతల రాకముందే కలోంజీ నూనెతో రెగ్యులర్ గా మర్ధనా చేసుకుంటే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version