Watermelon and Diabetes: డయాబెటిస్ పేషెంట్లు…పుచ్చకాయ తినొచ్చా..?

ఈమధ్య కాలంలో చాలామంది జబ్బుల బారిన పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 06:10 AM IST

ఈమధ్య కాలంలో చాలామంది జబ్బుల బారిన పడుతున్నారు. తినే ఆహారం, లైఫ్ స్టైల్లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగం ఒత్తిడి…ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల…చాలామంది ఆనారోగ్యం బారిన పడుతున్నారు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే…అది మన చేతుల్లో ఉంది. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే…రోగాలులేని జీవితాన్ని హాయిగా గడపవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక లైఫ్ స్టైల్ కారణంగా అనారోగ్య సమస్యలు వ్యాప్తిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ బాడినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

పట్టణాల్లోనే కనిపించే జబ్బులుు…పల్లెలకు పాకుతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతిఐదుగురిలోఒకరికి షుగర్ ఉండే పరిస్థితి నెలకొంది. అయితే ఈ స్థాయిలో బీపీ , షుగర్ బాధితుులండటం మరింత ఆందోళనను కలిగిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు…నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బును నియంత్రణలో ఉంచుకోలేక…పలు వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

అయితే షుగర్ బారినపడినవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ పుచ్చకాయ తియ్యాగా ఉండటం వల్ల దీన్ని తినొచ్చా లేదా అని చాలామందికి ఓ అనుమానం ఉంటుంది. అయితే పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదంటున్నారు వైద్యులు. ఎందుకుంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్లు విషయంలో షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటే…నీటి శాతం ఎక్కువగా ఉండి పిండిపదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ మిలాన్ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ తగ్గిపోతుంది. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా పుచ్చకాయ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.