Site icon HashtagU Telugu

‎Custard Apple: షుగర్ పేషంట్స్ సీతాఫలం తినవచ్చా.. తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

Custard Apple

Custard Apple

‎Custard Apple: సీజన్ లలో లభించే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. ఈ సీతాఫలం పండ్ల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి.. దీనిని కస్టర్డ్‌ యాపిల్‌ అని, షుగర్‌ యాపిల్‌ అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు మనకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండును తినవచ్చు. కాగా ఈ పండ్లు మనకు శీతాకాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అందుకే ఈ సీజన్లో వచ్చినప్పుడు వీటిని తప్పకుండా తినాలని చెబుతూ ఉంటారు. ఈ పండ్లలో విటమిన్ బి6, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

‎అయితే ఈ పండు ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా ఎలర్జీతో బాధపడేవాళ్లు అంటే సీతాఫలం తిన్న వెంటనే చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించవచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు సీతాఫలం తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినకూడదని అంటుంటారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు కూడా ఈ పండును ఎలాంటి భయం లేకుండా తినవచ్చట. షుగర్ ఉన్నవాళ్లు మితంగా ఈ పండుని తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇన్‌ ఫ్లమేషన్‌ తగ్గించి, గుండెకి మేలు చేస్తుందట.

‎ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ ఏ, సీ లు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. ఇక సీతాఫలం తింటే జలుబు చేస్తుందని చాలామందికి అపోహ ఉంటుంది. కానీ ఈ పండును తింటే ఎలాంటి జలుబు చేయదని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ పండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు సీతాఫలాన్ని తింటే చాలా మేలు అని చెబుతున్నారు. అంతేకాక ఇది అలసటను దూరం చేస్తుందట. అలాగే సీతాఫలంలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మెదడులోని ఒత్తిడి స్థాయిలను నియంత్రించడంతో పాటు పార్కిన్సన్స్, క్షీణించిన మెదడు జబ్బు నుంచి కూడా ఈ పండ్లు రక్షిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలగే సీతాఫలంలోని పీచు పదార్థం శరీరంలోని టాక్సిన్స్‌ ను సులభంగా తొలగించడంలో సహాయపడుతుందట. అంతేకాక అసిడిటీ, పొట్టలో పుండ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుందని చెబుతున్నారు.

Exit mobile version